
Eenadu•20 Jun 2026
బుల్లెట్లే లేని చోట.. ఇప్పుడు మిసైల్స్12 సంవత్సరాల క్రితం దేశంలో తరచూ బాంబు పేలుళ్లు జరిగినప్పుడు అప్పటి ప్రభుత్వం గానీ, ప్రధాని గానీ మౌనంగా ఉండేవారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. కానీ ప్రధాని మోదీ పాలనా కాలంలో ఉరి, పుల్వామా, పహల్గాం దాడులకు భారత్ గట్టిగా జవాబిచ్చిందని చెప్పారు. వైమానిక దాడులు, ఆపరేషన్ సిందూర్‌తో శత్రువులపై విరుచుకుపడ్డట్లు తెలిపారు. మోదీ హయాంలో భారత సైన్యం అధునాతనంగా తయారైందన్నారు. ఒకప్పుడు బుల్లెట్లు తయారు కాని చోట.. ఇప్పుడు మిసైల్స్ కూడా ఉత్పత్తి అవుతున్నాయని పేర్కొన్నారు. బుల్లెట్లే లేని చోట.. ఇప్పుడు మిసైల్స్: అమిత్ షా