
పుస్తకాల బరువుతో వంగిపోతున్న చిన్నారులు అమలుకు నోచుకోని విద్యాహక్కు చట్టం వాంకిడి(కుమరం భీం): బాల్యంపై భారం పెరిగి పోతోంది. వారిని పుస్తకాల బరువు కుంగదీస్తొంది. కిలోల కొద్ది బరువును వీపుపై మోస్తూ అనారోగ్యం భారిన పడాల్సి వస్తోంది. పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తమ లాభాపేక్ష కోసం ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయి. విద్యాహక్కు చట్టాన్ని తుంగలో తొక్కుతూ ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నాయి. అవసరం లేని, అర్హతకు మించిన పుస్తకాలను కొనుగోలు చేయించి విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. వాస్త వానికి నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులకు అసలు పుస్తకాలు ఉండొద్దని చట్టం పేర్కొంటుంది. కానీ ఈ నిబంధనలేవి అమలవడంలేదు. అంతేనా పలు ప్రైవేటు పాఠశాలలు పుణ్యమా అని ఒకటి రెండు తరగతుల విద్యార్థులే 30 నుంచి 45 పుస్త కాలను మోస్తున్నారు. వాస్తవానికి విద్యార్థి బరువులో 10 శాతం మాత్రమే పుస్తకాల బరువు ఉండాలని విద్యా హక్కు చట్టం చెబుతోంది. పుస్తకాలు పాఠశాలల్లో ఉంచుకునేలా ర్యాక్‌బాగులు లేదంటే లాకర్లు సదుపాయం ఏర్పాటు చేయాలని ఉన్నా అది కేవలం కొన్ని పాఠశాలలకే పరిమితమైంది. విద్యార్థులకు తరగతి గదులే సరి పడాలేని పలు పాఠశాలల్లో ఇక లాకర్ల సదుపాయం ఎక్కడ ఉంటుందనే వాదన వినిపిస్తోంది. కానీ ఇలాంటి పాఠశాలలను అధికారులు పట్టించకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మారిన ఫ్యాషన్ పోకడలను అనుసరించి విద్యార్థులు నడుం కిందకు బ్యాగు వేసుకుంటున్నారు. ఇలా వేసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ ఏడాది అకాడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసిన ప్రభుత్వం పది బ్యాగ్‌లెస్ డేస్‌ను నిర్వ హించాలని, నెలలో ప్రతీ మూడో శనివారం నో బ్యాగ్ డేగా పాటించాలని నిర్ణయం తీసుకుంది. అవసరం లేని పుస్తకాలతో అధికభారం... ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆరు సబ్జెక్టులకు సంబంధించి ఆరు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు ఉంటాయి. కానీ ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం అందకు










