
Tollywood Hit Combinations: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టోరీ కంటే ముందు కాంబినేషన్‌కు ఎక్కువగా ప్రాధాన్యాత ఇస్తున్నారు. ఒక హీరో, డైరెక్టర్ కలయికలో ఓ ఓ చిత్రం హిట్ అయితే వెంటనే ఆ కాంబినేషన్‌నే రిపీట్ చేస్తున్నారు. చిరంజీవి, బాలయ్య నుంచి మొదలు పెడితే యంగ్ హీరోల వరకు అందరు తమకు గతంలో సక్సెస్ ఇచ్చిన దర్శకులను రిపీట్ చేస్తున్నారు. బాలకృష్ణ, గోపిచంద్ మలినేని కలయికతో ‘వీరసింహారెడ్డి’ సినిమా తర్వాత మరో సినిమా పట్టాలెక్కబోతుంది. NBK 111 పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలయ్య ముంబై గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నాడు. బాలకృష్ణ బర్త్ డే సందర్బంగా విడుదల చేసిన గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. చిరంజీవి , బాబీ కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే కదా. తాజాగా వీళ్లిద్దరి కలయికతో ఓ సినిమా తెరకెక్కుతుంది. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. వెంకటేష్ - అనిల్ రావిపూడి - కళ్యాణ్ రామ్.. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌కు తెలుగులో మంచి గిరాకీ ఉంది. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వర ప్రసాద్ (గెస్ట్)ల తర్వాత వీళ్ల కలయికలో ఐదో సినిమా రాబోతుంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మరో హీరోగా నటిస్తున్నాడు. పటాస్ తర్వాత కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న రెండో సినిమా ఇదే. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. నాని - శ్రీకాంత్ ఓదేల.. నాని, శ్రీకాంత్ ఓదేల కాంబినేషన్ లో వచ్చిన ‘దసరా’ చిత్రం మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం వీళ్ల కాంబినేషన్ లో ‘ప్యారడైజ్’ చిత్రాన్ని త్వరలో రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు. ఎన్టీఆర్