
బ్లింకిట్ డెలివరీ పార్ట్‌నర్‌గా పనిచేయడంలో ప్రధాన ప్రయోజనం పని సమయాల్లో ఉండే స్వేచ్ఛ. సాధారణ ఉద్యోగాల మాదిరిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే షిఫ్ట్‌లో పనిచేయాల్సిన అవసరం ఉండదు. మీకు అనుకూలమైన సమయాల్లో పార్ట్‌టైమ్ లేదా ఫుల్‌టైమ్‌గా పనిచేయవచ్చు. విద్యార్థులు, ఉద్యోగులు లేదా అదనపు ఆదాయం కోరుకునే వారు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే Blinkit ప్రతి నెల జీతం ఇచ్చే విధానానికి బదులుగా వారానికోసారి చెల్లింపులు చేస్తుంది. దీంతో సంపాదించిన డబ్బు త్వరగా చేతికి అందుతుంది. ప్రమాదాలు లేదా ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు రక్షణగా ఉండేందుకు ప్రమాద భీమా, వైద్య భీమా వంటి సదుపాయాలను కూడా కంపెనీ అందిస్తోంది. ఎక్కువ డెలివరీలు పూర్తి చేసిన వారికి, ముఖ్యంగా రద్దీ సమయాల్లో పనిచేసిన వారికి అదనపు ఇన్సెంటివ్స్ కూడా లభిస్తాయి. బ్లింకిట్ డెలివరీ పార్ట్‌నర్‌గా చేరేందుకు కొన్ని ప్రాథమిక అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థి కనీసం 18 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. డెలివరీల కోసం సొంతంగా ద్విచక్ర వాహనం ఉండటం అవసరం. అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న స్మార్ట్‌ఫోన్ తప్పనిసరి. ఎందుకంటే అన్ని ఆర్డర్లు, డెలివరీ వివరాలు యాప్ ద్వారానే నిర్వహిస్తారు. అదనంగా, చెల్లింపులు స్వీకరించేందుకు యాక్టివ్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. డెలివరీ రంగంలో ముందస్తు అనుభవం లేకపోయినా ఎలాంటి సమస్య లేదు. కొత్తగా చేరిన వారికి Blinkit శిక్షణ అందిస్తుంది కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. Blinkit డెలివరీ పార్ట్‌నర్ రిజిస్ట్రేషన్ సమయంలో కొన్ని ముఖ్యమైన పత్రాలు సమర్పించాలి. వీటిలో చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC), ఇన్సూరెన్స్, PAN కార్డు, ఆధార్ కార్డు ముఖ్యమైనవి. అలాగే బ్యాంక్ ఖాతా వివరాలు కూడా ఇవ్వాలి. ఈ పత్రాల ఆధారంగానే కంపెనీ మీ వివరాలను ధృవీకరిస్తుంది. అందువల్ల అన్ని డాక్యుమెంట్లు ముందుగానే సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా Blinkit