బాబా రామ్ దేవ్ తో కలిసి సీఎం చంద్రబాబు
Actor ProfilePolitician

బాబా రామ్ దేవ్ తో కలిసి సీఎం చంద్రబాబు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బాబా రామ్ దేవ్ తో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ యోగాసనాలు
Telugu Times28 Jun 2026
బాబా రామ్ దేవ్ తో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ యోగాసనాలు

అమరావతి, జూన్ 21: ఇంటింటికీ యోగా... సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు కార్యాలయాల్లో యోగా మందిరాలను నిర్మిస్తామని అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆదివారం ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో సీఎం చంద్రబాబు యోగాంధ్ర లోగో ఉన్న చొక్కా ధరించి పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌తో ప్రముఖ యోగా గురు రామ్ దేవ్ బాబా వివిధ ఆసనాలు వేయించారు. ప్రాణాయామం, అనులోమ, విలోమ పద్దతుల్లో సీఎం చంద్రబాబు యోగాభ్యాసం చేశారు. అలాగే యోగాభ్యాసంలో భాగంగా వివిధ ఆసనాలను సీఎం చంద్రబాబు సునాయాసంగా వేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఐజీఎం స్టేడియం విద్యార్థి, యువతీ, యువకులతో నిండిపోయింది. వివిధ స్థాయిల్లోని అధికారులు, ఉద్యోగులు, ప్రజలు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. యోగాసనాలు వేశారు. ఉదయం ఐదు గంటల నుంచి రామ్ దేవ్ బాబా ప్రజలతో యోగ సాధన చేయించారు. సమాజహితం కోసం బాధ్యతతో వ్యవహరిస్తామని ప్రజలతో సీఎం చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ...”ప్రశాంత వాతావరణంలో యోగా గురువు రామ్ దేవ్ బాబాతో కలిసి యోగాభ్యాసం చేయడం ఎన్నటికీ మరువలేం. యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. ప్రధాని మోదీ ప్రపంచానికి భారతదేశ శక్తిని చాటుతున్నారు... దేశాన్ని అగ్రభాగాన నిలుపుతున్నారు. ప్రధాని చొరవతో 190 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రపంచానికి భారత్ విశ్వగురు... ప్రపంచానికి మార్గనిర్దేశం చేయగలిగేది భారతదేశం. ఫిజికల్, మెంటల్ ఫిట్ నెస్ పెంచేది యోగానే. యోగాను ప్రజలకు దగ్గర చేసిన రామ్ దేవ్ బాబా కృషి అమోఘం. సాంకేతికత.. ఆధ్యాత్మికత కాంబినేషన్ తో వెళ్తేనే భవిష్యత్. ఆథ్యాత్మికత, యోగా సాధనతో హెల్తీ, వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధ్యం. ఆధ్యాత్మికాంధ్రప్రదేశ్ సాధించేందుకు కృషి చేద్దాం.”అని ముఖ్యమంత్రి