బాంబు పేల్చిన తులసి గబ్బార్డ్
Actor ProfilePolitician

బాంబు పేల్చిన తులసి గబ్బార్డ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బాంబు పేల్చిన తులసి గబ్బార్డ్
Sakshi19 Jun 2026
బాంబు పేల్చిన తులసి గబ్బార్డ్

ప్రపంచాన్ని గడ గడలాడించిన మహమ్మారి కోవిడ్‌-19 వైరస్‌ మూలాలపై అమెరికా జాతీయ నిఘా సంస్థ మాజీ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ వెళుత వెళుతూ బాంబు పేల్చారు. చైనాలోని వుహాన్ ల్యాబ్‌కు ఆంథోనీ ఫౌచీ నిధులు ఇచ్చారు, కోవిడ్ వాస్తవాలను దాచారంటూ అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తికి సంబంధించి ఇప్పటికీ సాగుతున్న వివాదంలో సరికొత్త అగ్గి రాజేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ మాజీ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంథోనీ ఫౌచీ చైనాలోని వుహాన్ రీసెర్చ్ ల్యాబ్‌కు నిధులు సమకూర్చారని, ఈ ల్యాబ్ నుంచే కోవిడ్-19 మహమ్మారి వ్యాపించిందని అమెరికా అవుట్‌గోయింగ్ డీఎన్‌ఐ చీఫ్‌ తులసి గబ్బార్డ్ సంచలన ఆరోపణలు చేశారు. తన అనారోగ్యంతో ఉన్న భర్తను చూసుకోవడానికి గత నెలలో డోనాల్డ్ ట్రంప్ ఇంటెలిజెన్స్ చీఫ్ పదవికి రాజీనామా చేసిన తులసి గబ్బార్డ్ మాట్లాడుతూ.. నిజాన్ని దాచడానికి ఆంథోనీ ఫౌచీ ఉపయోగించిన వ్యూహాలు "డీప్ స్టేట్ ప్లేబుక్" ( తెరవెనుక శక్తుల వ్యూహం) నుండి వచ్చినవేనని అన్నారు. తన పదవీకాలం చివరి రోజున కొన్ని ‘ఇంతకుముందెన్నడూ చూడని’ రహస్య పత్రాలను విడుదల చేస్తూ ఈ విషయాలను వెల్లడించారు. 2020లో అమెరికాకు కోవిడ్ సోకినప్పుడు బైడెన్ ప్రభుత్వానికి నేతృత్వం వహించిన ఫౌచీ, వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (WIV)లో "బాట్ (గబ్బిలం) కరోనావైరస్‌లపై ప్రమాదకరమైన గెయిన్-ఆఫ్-ఫంక్షన్ (gain-of-function) పరిశోధనల" కోసం అమెరికా పన్ను చెల్లింపుదారుల మిలియన్ల డాలర్ల నిధులను అందించారని గబ్బార్డ్ పేర్కొన్నారు. వైరస్ ల్యాబ్ నుండి లీక్ అయిందనే నిజాన్ని కప్పి పుచ్చడానికి ఫౌచీ కెరీర్ లీడర్‌షిప్‌తో కలిసి పనిచేశారని తులసి గబ్బార్డ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇదీ చదవండి: 60 ఏళ్లకి లవ్‌, 75 రోజులకే పెళ్లి : నటి లవ్‌ స్టోరీ ట్రిలియన్ డాలర్ల వ్యాక్సిన్ వ్యాపారం కోసం వైరల్ పరిశోధనల గురించి