బాబు క్యాంప్ గ్రామ పంచాయతీలో యువ కుల హ ల్ చ ల్
Actor ProfilePolitician

బాబు క్యాంప్ గ్రామ పంచాయతీలో యువ కుల హ ల్ చ ల్

Total News1
Movie Updates0
Sources1
బాబు క్యాంప్ గ్రామ పంచాయతీలో యువ కుల హ ల్ చ ల్
Namasthe Telangana15 Jun 2026
బాబు క్యాంప్ గ్రామ పంచాయతీలో యువ కుల హ ల్ చ ల్

– రెండు వర్గాలుగా ఏర్పడి బీభత్సం సృష్టించిన యువకులు – పోలీసులు వచ్చిన ఆగని కొట్లాట – భయాందోళనకు గురైన స్థానికులు చుంచుపల్లి, జూన్ 15 : చుంచుపల్లి మండలంలోని బాబు క్యాంప్ గ్రామ పంచాయతీ పరిధిలో ఆదివారం రాత్రి యువకుల మధ్య జరిగిన ఘర్షణ స్థానికుల్లో భ‌యాందోళనకు దారితీసింది. గ్రామంలోని రామాలయం ఎదురుగా ప్రధాన రహదారిపై రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో రెండు వర్గాల యువకులు పరస్పరం దాడులకు దిగడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికుల కథనం ప్రకారం.. యువకులు రెండు వర్గాలుగా ఏర్పడి నడి రోడ్డుపై ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ వీరంగం సృష్టించడంతో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, వారి సమక్షంలోనే యువకులు ఘర్షణ కొనసాగించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంత పెద్ద ఘర్షణ జరిగినప్పటికీ ఇప్పటివరకు ఈ విషయం తమ దృష్టికి రాలేదని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఘర్షణ మధ్యలో పోలీసులు వచ్చిన వీడియోలు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి. అక్కడికి రంగ ప్రవేశం చేసిన పోలీసుల మధ్య స్థానిక ఓ రాజకీయ నాయకుడు జోక్యం చేసుకొని “ఇదంతా తాము చూసుకుంటాం.. మీరు వెళ్లండి” అంటూ హుకుం జారీ చేయడంతో పోలీసులు ఈ విషయాన్ని సున్నితంగా కొట్టి పారేశారనే ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. పోలీసుల చర్యలపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులదేనని, అయితే తరచూ జరుగుతున్న గొడవలపై సమర్థవంతమైన చర్యలు కనిపించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో చుంచుపల్లి మండలంలో శాంతిభద్రతల పరిస్థితిపై మరోసారి చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా ఈ ఘటనలో ఓ యువకుడు గాయపడినప్పటికీ కేసు నమోదు కాకపోవడం