
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Hanuman team rescued huge python in bhimavaram: ఇటీవల వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నైరుతి రుతుపవనాల ఎంట్రీతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండ పోతగా వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో పాములు, కొండ చిలువలు ఎక్కువగా జనావాల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా వెచ్చగా, చీకటిగా ఉండే ప్రదేశాలల్లో కోబ్రాలు, కొండ చిలువలు ఉండేందుకు ఆసక్తిని చూపిస్తాయి. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ప్రాజెక్ట్ హనుమాన్ ను ప్రారంభించారు. ముఖ్యంగా మానవ-వన్యప్రాణుల సంఘర్షణలను తగ్గించడంతో పాటు వన్యప్రాణులను రక్షించడానికి దీనికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ఏపీలో ఎక్కడ అడవుల్లోని జంతువులు జనావాసాల్లోకి వచ్చిన స్థానికులు వెంటనే హనుమాన్ ప్రాజెక్ట్ టీమ్ కు సమాచారం అందిస్తున్నారు. ఇటీవల వెస్ట్ గోదావరి భీమవరం యనమదుర్రు కాలువలో పూడికతీత పనులు చేపట్టారు. ఇంతలో భారీ కొండ చిలువ ఒకటి బైటపడింది. వెంటనే అక్కడ పనుల్లో ఉన్న వారు భయపడిపోయారు. అది పలు మార్లు వారిపై దాడికి యత్నించింది. ఈ నేపథ్యంలో స్థానికులు హనుమాన్ హనుమాన్ బృందం, అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన నిపుణులు ఎంతో చాకచక్యంగా గంటల పాటు శ్రమించి కొండ చిలువను పట్టుకున్నారు. అది 9 అడుగుల పొడవు, 20 కేజీల బరువులున్నట్లు గుర్తించారు. Read more: Cobra Video: బాప్ రే.. బతికున్న పామును బంతిలా ఎగిరేసి గుటుక్కున మింగిన కొంగ.. వీడియో వైరల్.. ఆ తర్వాత కొండచిలువను హనుమాన్ బృందం, సర్పమిత్ర-వజ్ర వాలంటీర్లు, అటవీ శాఖ సిబ్బంది సురక్షితంగా దగ్గరలోని అడవిలోకి తీసుకెళ్లి వదిలిపెట్టారు