బీజేపీ హిందుత్వకు రేవంత్ రెడ్డి 'ఆధ్యాత్మిక' టచ్
Actor ProfilePolitician

బీజేపీ హిందుత్వకు రేవంత్ రెడ్డి 'ఆధ్యాత్మిక' టచ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బీజేపీ హిందుత్వకు రేవంత్ రెడ్డి 'ఆధ్యాత్మిక' టచ్
Telugu Times27 Aug 2026
బీజేపీ హిందుత్వకు రేవంత్ రెడ్డి 'ఆధ్యాత్మిక' టచ్

రాజకీయాల్లో శత్రువును దెబ్బతీయాలంటే వారి బలాన్నే బలహీనతగా మార్చాలనే సూత్రాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కాగా వంటబట్టించుకున్నారు. “ముల్లును ముల్లుతోనే తీయాలి” అనే సామెతను తూచా తప్పకుండా అమలు చేస్తూ, బీజేపీ మార్కు హిందుత్వ రాజకీయాలకు అదే తరహా ఆధ్యాత్మిక బాణంతో సమాధానం ఇచ్చేందుకు రేవంత్ సిద్ధమయ్యారు. కేవలం రెండు లోక్‌సభ సీట్ల నుంచి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునే స్థాయికి ఎదిగిన బీజేపీకి ‘హిందుత్వ’ నినాదమే కీలక భూమిక పోషించిందనే విషయం తెలిసిందే. ఉత్తరాదిన మెజారిటీ రాష్ట్రాల్లో ఇదే ఫార్ములాతో అధికారంలోకి వచ్చిన కమలం పార్టీ, ఇప్పుడు దక్షిణాదిపై.. ముఖ్యంగా తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో హిందుత్వ అంశం బీజేపీకి ప్రధాన అజెండాగా మారకుండా ఉండేలా, కాంగ్రెస్ ప్రభుత్వం సనాతన ధర్మాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయడం లేదనే బలమైన సంకేతాలను ప్రజల్లోకి పంపుతూ సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఏకంగా రూ. 360 కోట్ల భారీ వ్యయంతో అత్యంత అధునాతన గోశాలల నిర్మాణానికి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. కేవలం గోరక్షణ ప్రకటనలకే పరిమితం కాకుండా యాదాద్రి, వేములవాడ, మొయినాబాద్‌లలో అంతర్జాతీయ ప్రమాణాలతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ గోశాలల ప్రారంభోత్సవానికి ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించాలని భావించడం రేవంత్ రెడ్డి పక్కా రాజకీయ చతురతకు నిదర్శనం. ప్రధాని మోదీ చేతుల మీదుగానే వీటిని ప్రారంభింపజేయడం ద్వారా రాష్ట్రంలో బీజేపీ చేసే రాజకీయ విమర్శల ముఖాన్ని శాశ్వతంగా మూసివేయవచ్చనేది సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్. గోసంరక్షణ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం రాజీపడటం లేదని నిరూపించేందుకు మూడు ప్రధాన కేంద్రాల్లో విస్తృతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొయినాబాద్‌లోని యెనికేపల్లిలో 90 ఎకరాల విస్తీర్ణంలో రూ. 160 కోట్ల భారీ వ్యయంతో అధునాతన గోశాల నిర్మాణం కాబోతోంది. ఇది రాబోయే జనవరి నాటికి పూర్తిస్థాయి నిర్వహణలోకి రానుంది