బిచ్కుంద రోడ్డు గుంతల్లో కూర్చుని మాజీ ఎమ్మెల్యే ధర్నా
Actor ProfilePolitician

బిచ్కుంద రోడ్డు గుంతల్లో కూర్చుని మాజీ ఎమ్మెల్యే ధర్నా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బిచ్కుంద రోడ్డు గుంతల్లో కూర్చుని మాజీ ఎమ్మెల్యే ధర్నా
HMTV25 Jun 2026
బిచ్కుంద రోడ్డు గుంతల్లో కూర్చుని మాజీ ఎమ్మెల్యే ధర్నా

Bichkunda: బిచ్కుంద రోడ్డు గుంతల్లో కూర్చుని మాజీ ఎమ్మెల్యే ధర్నా! బిచ్కుంద: బిచ్కుంద మున్సిపాలిటీలో రోడ్డు విస్తరణ పనులు 2.5 ఏళ్లు గడుస్తున్న పూర్తి కావడం లేదని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో రోడ్డుపై నిలిచిన వర్షపు నీటి గుంతల్లో బైఠాయించి వినూత్న రీతిలో BRS పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు. ఏళ్ళు గడుస్తున్న బిచ్కుంద మున్సిపాలిటీలో రోడ్డు విస్తరణ పనులు పూర్తి కావడం లేదని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ధర్నాకు దిగారు. ఆదివారం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ పట్టణంలో వర్షపు నీటి గుంతల్లో కూర్చుని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే వినూత్న రీతిలో నిరసన తెలిపారు. జుక్కల్ నియోజక వర్గానికి తలమానికంగా ఉన్న బిచ్కుంద పట్టణాన్ని మరింత అధ్వాన్నంగా చేస్తున్నారని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బిచ్కుంద రోడ్డు విస్తరణ పనులు ఆగిపోవడంతో నలుమూలల నుండి పట్టణానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, దుమ్ము ధూళి తో శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారని, రోడ్డుపై నిలిచిన మోకాలబంటి నీళ్లు వాహనాల సైలంసర్లలోకి చోరీ వాహనాలు చెడిపోతున్నాయని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే తోటపై నమ్మకం కోల్పోయామని, కాంగ్రెస్ ప్రభుత్వానికి వారం రోజుల సమయం ఇస్తున్నామని ప్రభుత్వం స్పందించి వెంటనే బిచ్కుంద పట్టణంలో 7 మీటర్ల వెడల్పుతో రోడ్డు విస్తరణ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో తాము ఇదే రోడ్డుపై రిలే నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమం లో మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్, బిచ్కుంద రైతు సేవ సహకార సంఘం చైర్మన్ నల్చార్ బాలు శ్రీహరి, వైస్ చైర్మన్ యాదవ్ రావు, కె. గంగాధర్, మాజి ఎండోమెంట్ చైర్మన్ బొమ్మ లక్ష్మణ్, రామచందర్, మెక్క సర్పంచ్ నవాజ్, ఖాన్ సబ్, ముఖీద్ తదితరులు పాల్గొన్నారు