బెంగళూరు దశ తిరుగుతోంది
Actor ProfilePolitician

బెంగళూరు దశ తిరుగుతోంది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బెంగళూరు దశ తిరుగుతోంది
Oneindia Telugu9 Jul 2026
బెంగళూరు దశ తిరుగుతోంది

కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు భారీ ఉపశమనం కలిగించేలా కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న గృహ విద్యుత్ సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు తాత్కాలిక విద్యుత్ కనెక్షన్‌తో సేవలు పొందుతున్న పాత భవనాలకు శాశ్వత విద్యుత్ లైన్లు పొందేందుకు 15 రోజుల పాటు ఒకేసారి ప్రత్యేక గడువు విధిస్తూ మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న ప్రజోపయోగకర నిర్ణయాలను ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు.ప్రభుత్వ తాజా నిబంధనల ప్రకారం మే 31, 2000వ సంవత్సరానికి ముందే నిర్మాణం పూర్తయి, ప్రస్తుతం తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ కలిగి ఉన్న పాత గృహ సముదాయాలకు మాత్రమే ఈ అవకాశం వర్తిస్తుంది. కటాఫ్ తేదీ తర్వాత నిర్మాణం పూర్తయిన భవనాలకు ఈ మినహాయింపు వర్తించదు. తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ ను శాశ్వతంగా మార్చుకోవడానికి ప్రత్యేకంగా 15 రోజుల విండో విధానాన్ని అమలు చేయనుంది ప్రభుత్వం. దరఖాస్తుదారుడు తన ఫోటో, సంబంధిత భవనం ఫోటో, జీపీఎస్ లొకేషన్‌ను సమర్పించాల్సి ఉంటుంది.సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉంటూ వచ్చిన అంశం ఇది. ప్రస్తుతం బెంగళూరు సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నివాస భవనాలు, వాణిజ్య సముదాయాలకు తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 2000, మే 31 నాటికి నిర్మాణం పూర్తయిన వాటి విద్యుత్ కనెక్షన్లన్నింటినీ కూడా ప్రభుత్వం క్రమబద్దీకరించనుంది. దీనివల్ల రియల్ ఎస్టేట్ మరింత పుంజుకొంటుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.గ్రామీణ ప్రాంతాల్లోని పేద రైతుల కోసం పట్టు పురుగుల పెంపక కేంద్రాలు, పశువుల పాకలు, పాడి పరిశ్రమ షెడ్లకు ఈ నిబంధనల నుంచి ప్రత్యేక రాయితీలు కల్పిస్తూ కర్ణాటక మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా రూ. 235.60 కోట్ల వ్యయంతో కేఎస్ఆర్‌టీసీ, నార్త్ వెస్ట్ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థల కోసం 620 నూతన బీఎస్-4