
ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘మా ఇంటి బంగారం’. ఈ మూవీ ఫస్ట్ డే రాబట్టిన కలెక్షన్లతో సమంత చాలా హ్యాపీగా ఉన్నారు. ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ పై సమంత (Samantha), రాజ్ నిడిమోరు (Raj Nidimoru), హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaaram). టాలెంటెడ్ డైరెక్టర్ నందినీ రెడ్డి (Nandini Reddy) దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. చాలా గ్యాప్ తర్వాత సమంత నటించిన చిత్రం కావడంతో.. ఆమెను చూసేందుకు థియేటర్ల వద్ద ప్రేక్షకుల సందడి నెలకుంది. ముఖ్యంగా సమంత యాక్షన్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌కు, నందినీ రెడ్డి టేకింగ్‌కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఈ పాజిటివ్ వేవ్స్ బాక్సాఫీస్ కలెక్షన్లపై గట్టిగానే ప్రభావం చూపించాయి. మొదటి రోజే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 13.15 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ (Maa Inti Bangaaram 1st Day Collections) రాబట్టి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఈ స్థాయి ఓపెనింగ్స్ రావడం చూస్తుంటే.. టాలీవుడ్‌లో సమంత రేంజ్ ఏంటో మరోసారి నిరూపించింది. ‘బ్లాక్‌బస్టర్ బంగారం’ అంటూ మేకర్స్ రిలీజ్ చేసిన అఫీషియల్ కలెక్షన్ల పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‌లో.. చేతిలో గన్ పట్టుకుని శారీ లుక్‌లో సమంత కనిపిస్తున్న ఈ రగ్గడ్ పోస్టర్ సినిమాలోని ఇంటెన్సిటీని తెలియజేస్తోంది. సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చాయంటూ రివ్యూలు వస్తున్నాయి. టాక్‌తో పాటు.. వీకెండ్ కావడంతో ఈ సినిమాకు కలెక్షన్ల జోరు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక