బంగారు అక్షరాలతో యుద్ధ స్మారకం
Actor ProfilePolitician

బంగారు అక్షరాలతో యుద్ధ స్మారకం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బంగారు అక్షరాలతో యుద్ధ స్మారకంపై ధీరుల పేర్లు
Oneindia Telugu25 Jul 2026
బంగారు అక్షరాలతో యుద్ధ స్మారకంపై ధీరుల పేర్లు

భారతదేశ సార్వభౌమత్వాన్ని, సరిహద్దు భద్రతను కాపాడేందుకు వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించిన ఆరుగురు సాయుధ దళాల సిబ్బంది పేర్లను కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ తాజాగా అధికారికంగా వెల్లడించింది. సరిహద్దుల అవతల ఉగ్రవాద నిర్మూలన కోసం భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంలో వీరు వీరమరణం పొందారు. మరణానంతరం వీరి సేవలను స్మరిస్తూ అమరవీరుల పేర్లను ఆర్మీ వార్ మెమోరియల్ వెబ్ సైట్‌లో చేర్చారు. న్యూఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద ప్రత్యేక గ్రెనైట్ ఫలకాలపై వీరి పేర్లను శాశ్వతంగా చెక్కాలని రక్షణ శాఖ నిర్ణయించింది. ఈ చారిత్రాత్మక ఆపరేషన్‌లో దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన వారిలో ఐదుగురు సైనిక సిబ్బందితో పాటు ఒక వైమానిక దళ అధికారి ఉన్నారు.సుబేదార్‌ మేజర్‌ పవన్‌ కుమార్‌ - 10 ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్‌ హెడ్‌క్వార్టర్స్‌రైఫిల్‌మ్యాన్‌ సునీల్‌ కుమార్‌ - జమ్మూకశ్మీర్‌ లైట్‌ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్‌కు చెందిన 4వ బెటాలియన్‌లాన్స్‌ నాయక్‌ దినేశ్‌ కుమార్‌ - 5 ఫీల్డ్‌ రెజిమెంట్‌హవల్దార్‌ సునీల్‌ కుమార్‌ సింగ్‌ - 237 ఫీల్డ్‌ వర్క్‌షాప్‌సార్జెంట్‌ సురేంద్ర కుమార్‌ - ఎయిర్‌ఫోర్స్‌ 39వ వింగ్‌అగ్నివీర్‌ మురళీ నాయక్‌ - 851 లైట్‌ రెజిమెంట్‌వీరి వీరోచిత పోరాటాన్ని గుర్తిస్తూ అమరుడైన రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్‌కు మరణానంతరం దేశ మూడో అత్యున్నత రక్షణ పురస్కారమైన వీర్ చక్రను, సార్జెంట్ సురేంద్ర కుమార్‌కు వాయు సేన మెడల్ను ప్రభుత్వం అందజేసింది.ఆపరేషన్ సిందూర్: ఉగ్రవాదంపై సాగిన పోరాటంకాశ్మీర్‌ పహల్గామ్‌లోని అందమైన బైసారన్ వ్యాలీలో ప్రశాంతంగా గడుపుతున్న పర్యాటకులపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు హఠాత్తుగా విచక్షణారహిత కాల్పులు జరిపారు. ఈ దారుణ ఘటనలో 25 మంది అమాయక పర్యాటకులు, ఒక స్థానిక సహాయకుడు కలిపి మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయవిదారక ఉగ్రదాడి దేశాన్ని తీవ్రంగా కలచివేసింది. ఈ ఘోర ఘటనలో తమ భర్తలను కోల్పోయి రోదిస్తున్న వితంతువుల వేదనకు న్యాయం చేయాలని, వారి