బిగ్ బాస్ హౌస్ లోకి టాలీవుడ్ హీరో భార్య..వారానికి రూ.6 లక్షలు రెమ్యూనరేషన్
Actor ProfileActor

బిగ్ బాస్ హౌస్ లోకి టాలీవుడ్ హీరో భార్య..వారానికి రూ.6 లక్షలు రెమ్యూనరేషన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బిగ్ బాస్ హౌస్ లోకి టాలీవుడ్ హీరో భార్య..వారానికి రూ.6 లక్షలు రెమ్యూనరేషన్
Zee Telugu28 Jul 2026
బిగ్ బాస్ హౌస్ లోకి టాలీవుడ్ హీరో భార్య..వారానికి రూ.6 లక్షలు రెమ్యూనరేషన్

Tejaswini Gowda Bigg Boss 10 Telugu: బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన పాపులర్ రియాలిటీ షో 'బిగ్‌బాస్ తెలుగు' సీజన్ 10 కోసం ప్రేక్షకులు ఇప్పటి నుంచే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సాధారణంగా సెప్టెంబర్ మొదటి వారంలో ఈ షో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈసారి పదో ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈసారి కంటెస్టెంట్ల ఎంపికపై మేకర్స్ భారీ స్కెచ్ వేస్తున్నారు. క్రేజ్, పాపులారిటీ ఉన్న సెలబ్రిటీల కోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు వెనకాడటం లేదు. గత సీజన్లలో కంటెస్టెంట్‌గా వచ్చి, తన ఆటతీరుతో రన్నరప్‌గా నిలిచిన అమర్‌దీప్ చౌదరి గుర్తున్నాడుగా? ఇప్పుడు ఆయన భార్య, ప్రముఖ సీరియల్ నటి తేజస్విని గౌడ బిగ్‌బాస్ 10లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో గట్టి టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం తేజస్విని తమిళ సీరియల్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. ఆ ప్రాజెక్టులను వదులుకుని బిగ్‌బాస్ హౌస్‌లోకి రావడానికి ఆమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. బిగ్‌బాస్‌లో కొనసాగేందుకు వారానికి కనీసం రూ.6 లక్షల చొప్పున ఆమె డిమాండ్ చేసిందట. తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్‌లో, సోషల్ మీడియాలో తేజుకున్న క్రేజ్ దృష్ట్యా.. ఆమె అడిగిన భారీ మొత్తానికి బిగ్‌బాస్ నిర్వాహకులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఆమె వస్తే షో టీఆర్‌పీ రేటింగ్స్ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్తాయని మేకర్స్ భావిస్తున్నారు. సోషల్ మీడియా ప్రచారం ప్రకారం.. సీజన్ 10 కంటెస్టెంట్ల రేసులో చాలా మంది ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో కొందరు జబర్దస్త్ టీమ్ నుంచి వర్ష, పవిత్ర, వర్షిణి, ఎక్స్‌ప్రెస్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేష్ వంటి వారి పేర్లు వినిపిస్తుండగా.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల నుంచి నందూస్ వరల్డ్ ఫేమ్ నందన, రాయల్ మెక్ రమణ, శివ్, కడలి సత్యనారాయణ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. స్టార్ కపుల్స్ /రిలేటివ్స్ గా పేరొందిన