బాక్సాఫీసు వద్ద సమంత ర్యాంపేజ్ .. 5 రోజుల్లో మా ఇంటి బంగారంకి అదిరిపోయే వసూళ్లు
Actor ProfileActor

బాక్సాఫీసు వద్ద సమంత ర్యాంపేజ్ .. 5 రోజుల్లో మా ఇంటి బంగారంకి అదిరిపోయే వసూళ్లు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బాక్సాఫీసు వద్ద సమంత ర్యాంపేజ్ .. 5 రోజుల్లో మా ఇంటి బంగారంకి అదిరిపోయే వసూళ్లు
Asianet News Telugu10 Jul 2026
బాక్సాఫీసు వద్ద సమంత ర్యాంపేజ్ .. 5 రోజుల్లో మా ఇంటి బంగారంకి అదిరిపోయే వసూళ్లు

సమంత కమ్‌ బ్యాక్‌ ఇస్తూ నటించిన `మా ఇంటి బంగారం` మూవీ ఊహించని విధంగా దూసుకుపోతుంది. సినిమాకి మిక్స్‌ డ్‌ టాక్‌ వచ్చినా అదిరిపోయే కలెక్షన్లని రాబడుతోంది. ఈ మూవీ ప్రారంభం నుంచి బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతోంది. ఇప్పుడు రెండో వారంలో దుమ్మురేపుతోంది. మంచి వసూళ్లతో రన్‌ అవుతుంది. సోమవారం నుంచి కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. మంగళవారం కూడా డీసెంట్‌ నెంబర్స్ రావడం విశేషం. మరి ఐదు రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఇప్పటి వరకు ఎంత కలెక్షన్లు వచ్చాయి? ఇంకా ఎంత రావాలి అనేది చూస్తే. సమంత హీరోగా నటించిన `మా ఇంటి బంగారం` ఐదు రోజుల్లో రూ.51.32కోట్లు రాబట్టినట్టు ప్రముఖ కలెక్షన్ల సైట్‌ `సాక్నిల్క్` వెల్లడించింది. దీనికి మంగళవారం మూడున్నర కోట్లు రావడం విశేషం. సోమవారం రూ.4.10కోట్లు రాగా, మంగళవారం అరవై లక్షలు తగ్గాయి. ఆదివారం పది కోట్లు వసూలు చేయగా, సోమవారానికి 60శాతం పడిపోయింది. కానీ ఈ స్థాయిలో వసూళ్లు రావడం విశేషమనే చెప్పాలి. ఇది సినిమా సక్సెస్‌కి నిదర్శనంగా నిలుస్తోంది. `మా ఇంటి బంగారం` మూవీకి మొదటి రోజు రూ.5.35కోట్లు, రెండో రోజు రూ.7.65కోట్లు, మూడో రోజు రూ.10.10కోట్లు వచ్చాయి. మొదటి మూడు రోజుల్లో క్రమంగా కలెక్షన్లు పెరిగాయి. మౌత్‌ టాక్‌తో సినిమాకి పాజిటివిటీ పెరిగింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో వాళ్లు సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తుంది. ఇది సినిమా సక్సెస్ కి కారణమైందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఈ మూవీకి నాలుగు రోజుల్లో రూ.50కోట్లు కలెక్ట్ చేసినట్టు టీమ్‌ వెల్లడించింది. ఐదు రోజుల్లో రూ.55కోట్ల పోస్టర్‌ని రిలీజ్‌ చేయనున్నారు. సమంత మూడేళ్ల తర్వాత కమ్‌ బ్యాక్‌ ఇచ్చిన `మా ఇంటి బంగారం` మూవీతో బ్లాక్‌ బస్టర్ దిశగా వెళ్తోంది. ఈ మూవీకి సుమారు రూ.30కోట్ల బడ్జెట్‌ అయ్యిందని సమాచారం. ఓటీటీ రైట్స్, శాటిలైట్‌ రైట్స్, ఆడియో రైట్స్