కుకు విత్ జాతిరత్నాలు షోలో కొత్త కుక్స్ రాకతో కొత్త సందడి కనిపిస్తోంది. అయితే శనివారం నాటి బ్యాచ్‌లో వచ్చిన శ్రవణ్, పునర్నవి తమ తమ రెసిపీలతో అదరగొట్టేశారు. ఆదివారం బ్యాచ్‌లో వచ్చిన కృతిక , సుమిత్ మాత్రం బొక్కబోర్లా పడ్డారు. అసలు వారు ఏ రెసిపీలు చేశారు.. ఎక్కడ తేడా కొట్టింది.. ఆదివారం నాడు జాతిరత్నాలు ఎలాంటి గెటప్పుల్లో వచ్చారు.. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి.. స్కోర్ బోర్డులో ఎవరి స్థానం ఏంటి? అన్నది ఓ సారి చూద్దాం.ఆదివారం నాడు లెజెండరీ కమెడియన్స్ పావలా శ్యామల, కల్పనా రాయ్, బ్రహ్మానందం, బాబు మోహన్, ఎంఎస్ నారాయణ గెటప్పుల్లో జాతి రత్నాలు వచ్చారు. అందరికీ కంటే ఇమ్ము మాత్రం బాబు మోహన్‌లా నటించి అదరగొట్టేశాడు. ఇక పెయిరింగ్ టాస్కులో కృతికకి ఇమ్ము, పవన్‌కి హరి, రాకేష్‌కి రీతూ, సుమిత్‌కి దీపిక, పల్లవికి దీక్ష వచ్చారు. అడ్వాంటేజ్ టాస్కులో ఇమ్ము,కృతిక గెలిచారు. ఈ క్రమంలో గెలిచిన కుక్.. ఇతర కుక్స్ వండే వంటకాల్లోంచి ఏదో ఒక ఇంగ్రీడియంట్‌ను తీసుకోవచ్చన్నారు. దీంతో గెలిచిన కృతిక.. పవన్ వండే వంటకం నుంచి ఓ ఇంగ్రీడియంట్‌ను తీసుకుంది.మధ్య మధ్యలో జడ్జ్‌లు వచ్చి సందడి చేశారు. అందరూ కలిసి వేసిన స్టెప్పులు కూడా వైరల్ అయ్యాయి. అయితే బాబు మోహన్‌గా ఇమ్ము మాత్రం ఓ రేంజ్‌లో నవ్వించారు. ఇక జాతి రత్నాలు ఓ బెలూన్ మీద కూర్చుని ఎగురుతూ వంటకు కావాల్సిన సామాన్లు తీసుకు వచ్చారు. ఈ క్రమంలో దీపిక, ఇమ్ము చాలా సార్లు కింద పడిపోయారు. అలా అక్కడ బాగానే ఫన్ జనరేట్ అయింది. కుక్స్ చివరకు తమ తమ రెసిపీలను రెడీ చేశారు. కృతిక చేసిన గోల్డెన్ బ్లూమ్ టాట్‌ను జడ్జ్‌లు తిని సో సోగా ఉందని అన్నారు. అందరూ ఎన్నో వెరైటీలు చేస్తున్నారు.. నువ్వు మాత్రం సింపుల్‌గా ఒక్క ఐటమే చేశావ్.. వావ్
Actor ProfileActor
బొక్కబోర్లా పడ్డ కొత్త కుక్స్.. కన్నీరు పెట్టిన పల్లవి.. పొదరిల్లు మహాకి ఎదురుదెబ్బ
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•7 Aug 2026
బొక్కబోర్లా పడ్డ కొత్త కుక్స్.. కన్నీరు పెట్టిన పల్లవి.. పొదరిల్లు మహాకి ఎదురుదెబ్బ