
శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ పై ఏ.ఎన్. బాలాజీ ఇప్పటికే ఎన్నో తమిళ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఈసారి ఆయన ఓ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకులకు అందించబోతున్నారు. ఇప్పుడాయన నిర్మిస్తోన్న చిత్రమే ‘ఫీల్ మై లవ్’. ‘ఫీల్ మై లవ్’ (Feel My Love) సినిమాకు నటుడు, దర్శకుడు ఆర్. రాధాకృష్ణన్ పార్తిబన్ (R Parthiban) సపోర్ట్ అందించారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ పై ఏ.ఎన్. బాలాజీ (AN Balaji) ఇప్పటికే ఎన్నో తమిళ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఈసారి ఆయన ఓ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకులకు అందించబోతున్నారు. ఆయన నిర్మిస్తోన్న చిత్రమే ‘ఫీల్ మై లవ్’. ఈ సినిమాలో ఆదిత్య భాస్కర్, ఐరా, అమ్ము అభిరామి, రాజయ్యప్ప, నోబెల్ జేమ్స్, ప్రియాంక ప్రధాన పాత్రల్లో నటించారు. జీవితంలో ఏ క్షణంలోనైనా అద్భుతం జరగొచ్చు అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని హరి ప్రకాష్ రూపొందిస్తున్నారు. రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్, యూత్‌కి నచ్చే కంటెంట్‌తో ఈ మూవీ రాబోతోందని.. ఫీల్-గుడ్ కథనం, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో యువత, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను కోలీవుడ్ నటుడు, దర్శకుడు రాధాకృష్ణన్ పార్తిబన్ రిలీజ్ చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మూవీ టైటిల్ పోస్టర్ కూడా మంచి ఫీలింగ్‌ని ఇస్తోంది. ఇదొక అందమైన ప్రేమ కథతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కథనంతో రాబోతోందని.. చెన్నై, పుదుచ్చేరిలోని అద్భుతమైన లొకేషన్లలో సినిమాని చిత్రీకరించామని చిత్రబృందం తెలియజేసింది. చివరి షెడ్యూల్‌ను హిల్ స్టేషన్ అయిన మున్నార్‌లో షూట్ చేయనున్నారు. ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించే సన్నివేశాలన్నీ.. కథనానికి విజువల్ గ్రాండియర్‌ను, ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తాయని చెబుతున్నారు. రాజా రవివర్మ ఎస్, బాలసుబ్రహ్మణ్యన్ జి ద్వయం ఈ చిత్రానికి సంగీత దర్శకులుగా పని చేస్తున్నారు