ఫాలో చేయటం ఆపండి.. నెటిజన్
Actor ProfileActor

ఫాలో చేయటం ఆపండి.. నెటిజన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఫాలో చేయటం ఆపండి.. నెటిజన్ పై ఖుష్బూ సుందర్ ఫైర్
Andhra Jyothy10 Aug 2026
ఫాలో చేయటం ఆపండి.. నెటిజన్ పై ఖుష్బూ సుందర్ ఫైర్

నటి ఖుష్భూ సుందర్ పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో రచ్చకు దారి తీసింది. వందల మంది ఈ పోస్టుపై నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. ఖుష్భూపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్‌నెట్ డెస్క్: ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు కే భాగ్యరాజ్ నిన్న ఉదయం గుండె పోటు కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. సీనియర్ నటి ఖుష్బూ సుందర్ కూతురి పెళ్లికి వెళ్లి వచ్చిన మరుసటి రోజే ఆయన చనిపోయారు. భాగ్యరాజ్ మరణంపై ఖుష్బూ సుందర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మేరకు ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. కొన్ని గంటల తర్వాత ఆమె తన భర్తతో ఉన్న మరో ఫొటోను షేర్ చేశారు. ఆ ఫొటోలో భార్యాభర్తలు నవ్వుతూ ఉన్నారు. ఇదే సోషల్ మీడియాలో రచ్చకు దారి తీసింది. వందల మంది ఈ పోస్టుపై నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. ఖుష్భూపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫోటోపై ‘దీప ప్రియ జయ ప్రకాశ్’ అనే మహిళ ఓ కామెంట్ పెట్టింది. ‘భాగ్యరాజ్ సార్ చనిపోయి రాష్ట్రం మొత్తం విషాదంలో ఉంటే.. ఇప్పుడు ఈ ఫొటో అంత అవసరమా?’ అని మండిపడింది. ఈ కామెంట్‌పై ఖుష్భూ సుందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె స్పందిస్తూ.. ‘అలా అయితే, నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారు. విమర్శించటం కోసమేనా? నా కూతురు పెళ్లి చేసుకుని 48 గంటలు కూడా కాలేదు. పూర్ణిమ(భాగ్యరాజ్ సతీమణి) గురించి ఎవరికి బాగా తెలుసు? నీకా లేక నాకా? నీకది ఇబ్బందిగా అనిపిస్తే.. నన్ను ఫాలో అవ్వటం ఆపేయ్. నీలాంటి వాళ్లు నా జీవితంలో లేకపోతేనే ఎంతో సంతోషంగా ఉంటా. సంతోషంగా ఉండేందుకు అన్ని హక్కులు నాకు ఉన్నాయి’ అని అన్నారు. దీప ప్రియ జయ ప్రకాశ్ కామెంట్‌పై నెటిజన్లు మిశ్రమంగా స్పందించటం మొదలెట్టారు. కొంతమంది ఆమెను సపోర్ట్ చేస్తుంటే మరి కొంతమంది తప్పుబడుతున్నారు. దీంతో దీప