ఫ్రాన్స్ లో రాజమౌళి చరిత్ర
Actor ProfileActor

ఫ్రాన్స్ లో రాజమౌళి చరిత్ర

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఫ్రాన్స్ లో రాజమౌళి చరిత్ర
Chitrajyothy3 Sept 2026
ఫ్రాన్స్ లో రాజమౌళి చరిత్ర

దర్శక ధీరుడిని మరోసారి ప్రపంచం మెచ్చింది. దిగ్గజ మూవీ మేకర్లకు లభించే గౌరవం దక్కింది. ఇండియన్ సినిమా గర్వంగా ఫీల్ అయ్యేలా రాజమౌళిని అంతర్జాతీయ వేదిక గుర్తించింది. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి.. అంతర్జాతీయ వేదికపై మరో అరుదైన చరిత్ర సృష్టించారు. ఫ్రాన్స్‌లోని ప్రతిష్ఠాత్మక 'లూమియర్ మ్యూజియం'లో మన జక్కన్న పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. యావత్ భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వంతో తలెత్తుకునే సంఘటన చోటు చేసుకుంది. రాజమౌళి మార్క్ విజువల్ వండర్స్ అయిన 'ఈగ', 'ఆర్.ఆర్.ఆర్.' సినిమాలు హౌస్‌ఫుల్ ప్రదర్శనలతో దూసుకుపోయిన అదే లూమియర్ థియేటర్‌లో ఆయనకు గ్రాండ్ వెల్‌కమ్ లభించింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టర్ థియరీ ఫ్రేమో స్వయంగా రాజమౌళిని స్టేజ్ పైకి ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. అయితే అసలైన సర్ ప్రైజ్ ఆ తర్వాతే రివీల్ అయింది. మార్టిన్ స్కోర్సెసీ, క్వెంటిన్ టరంటినో వంటి వరల్డ్ క్లాస్ లెజెండరీ డైరెక్టర్ల నేమ్ బోర్డ్స్ ఉండే ప్రతిష్టాత్మక 'ముర్ దే సినియాస్ట్స్' వాల్ వద్దకు రాజమౌళిని తీసుకెళ్లారు. అక్కడ రెడ్ క్లాత్‌తో కప్పి ఉన్న ఫలకాన్ని ఓపెన్ చేయగానే.. ప్రపంచ సినిమా దిగ్గజాల పక్కన రాజమౌళి పేరు సగర్వంగా మెరిసిపోయింది. ఈ అద్భుత క్షణాన్ని చూసి రాజమౌళి ఎమోషనల్ అయ్యారు. ఇది తన లైఫ్ టైమ్ మెమరీ అని, ఈ గౌరవాన్ని ఎప్పటికీ మరువలేనని సంతోషం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక తెలుగు డైరెక్టర్‌కు దక్కిన గౌరవం కాదు.. యావత్ భారతీయ సినిమా ఖ్యాతిని గ్లోబల్ లెవెల్‌లో మరోస్థాయికి తీసుకెళ్లిన చారిత్రాత్మక ఘట్టం. ఎట్ట‌కేల‌కు.. విజయ్ 'జన నాయగ‌న్' సెన్సార్ పూర్తి? Kayadu Lohar: టెన్త్ క్లాస్‌లోనే అంత పని చేసిందా? వైజయంతీ మూవీస్ బ్యానర్ రూటే వేరు.. బ్రాండ్ అంటే ఇది!