ఫ్రాన్స్ లోని 'విల్లా కెర్లియోస్ 'ను సందర్శించిన ప్రధాని మోదీ
Actor ProfilePolitician

ఫ్రాన్స్ లోని 'విల్లా కెర్లియోస్ 'ను సందర్శించిన ప్రధాని మోదీ

Total News1
Movie Updates0
Sources1
ఫ్రాన్స్ లోని 'విల్లా కెర్లియోస్ 'ను సందర్శించిన ప్రధాని మోదీ
Vaartha14 Jun 2026
ఫ్రాన్స్ లోని 'విల్లా కెర్లియోస్ 'ను సందర్శించిన ప్రధాని మోదీ

Narendra Modi: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనలో ఒక అరుదైన దౌత్య ఘట్టం ఆవిష్కృతమైంది. ఆదివారం ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో ఉన్న చారిత్రక కట్టడం ‘విల్లా కెర్లియోస్’ను ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల అగ్రనేతలు ఎంతో ఆత్మీయ వాతావరణంలో, తేలికపాటి సంభాషణలు సాగిస్తూ ఆ భవన ప్రాంగణమంతా కలియతిరిగారు. ఇరు నేతల మధ్య ఉన్న సుదృఢ బంధానికి ఈ పర్యటన అద్దం పట్టింది. read also: Gurbhej Singh: లండన్ లో భారత సంతతి యువకుడు దారుణ హత్య 20వ శతాబ్దపు ఆరంభంలో నిర్మితమైన ‘విల్లా కెర్లియోస్’ ప్రపంచ ప్రసిద్ధ హౌస్ మ్యూజియంగా గుర్తింపు పొందింది. క్రీస్తుపూర్వం 2వ శతాబ్ద కాలం నాటి ఒక పురాతన గ్రీకు ఉన్నత వర్గాల నివాస శైలిని ఆధారంగా చేసుకుని, ఎంతో అద్భుతంగా ఈ భవనాన్ని పునఃసృష్టించారు. ఫ్రెంచ్ రివేరా తీరప్రాంతంలో, నైస్ – మొనాకో నగరాల మధ్యన ఉన్న ‘బ్యూలీ-సర్-మెర్’ అనే సుందరమైన ప్రదేశంలో ఇది కొలువై ఉంది. మధ్యధరా సముద్ర తీరాన ఒక రాతి ద్వీపకల్పంపై ఉండే ఈ అపురూప కట్టడం ప్రస్తుతం జాతీయ వారసత్వ సంపదగా వర్గీకరించబడింది. దీని నిర్వహణ బాధ్యతలను ‘ఇన్‌స్టిట్యూట్ డి ఫ్రాన్స్’ చూసుకుంటుంది. ఈ చారిత్రక విహారానికి ముందు, నీస్ నగరంలో ఏర్పాటు చేసిన ‘భారత్ ఇన్నోవేట్స్’ (India Innovates) సదస్సును మోదీ, మేక్రాన్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ వేదికపై పీఎం మోదీ ప్రసంగిస్తూ.. భారతదేశంలో ఆర్థిక, సాంకేతిక రంగాల సంస్కరణల వేగం అస్సలు తగ్గబోదని స్పష్టం చేశారు. దేశంలో స్టార్టప్ ఇకోసిస్టమ్ మరింత వేగంగా విస్తరిస్తోందని అన్నారు. గత దశాబ్ద కాలంలో భారత్ అద్భుతమైన ఆవిష్కరణల వ్యవస్థను నిర్మించుకుందని గుర్తు చేశారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా మూడో అతిపెద్ద స్టార్టప్ హబ్‌గా భారత్ నిలిచిందని గర్వంగా ప్రకటించారు. గ్లోబల్ సవాళ్లకు సరికొత్త సాంకేతిక పరిష్కారాలను కనుగొనడంలో