
పిఠాపురం: ఫ్రిజ్ వాటర్ అడిగితే.. తొందరగా తేలేదని కసాయి కొడుకు విచక్షణారహితంగా దాడి చేయడంతో అతని కన్నతల్లి చికిత్సపొందుతూ కన్నుమూసిన అమానవీయ ఘటన కాకినాడ జిల్లాలో గగుర్పాటుకు గురిచేసింది. పిఠాపురం మండలం చిత్రాడలో ఈ దారుణం జరిగింది. పోలీసులు కథనం ప్రకారం.. స్థానిక ఈబీసీ కాలనీకి చెందిన పెంటా నాగమణి(45) తన కుమారుడు రాజబాబుకు ఈ నెల 9న మధ్యాహ్నం భోజనం వడ్డించింది. తింటున్న అతడు ఫ్రిజ్‌లోని మంచినీళ్లు తెమ్మన్నాడు. కాస్త ఆలస్యం కావడంతో కోపోద్రిక్తుడైన రాజబాబు అరుస్తూ ఫ్రిజ్ దగ్గరకు వెళ్తూ గుమ్మానికి ఢీకొని గాయపడ్డాడు. విచక్షణ కోల్పోయిన అతడు అదే సమయంలో మంచినీళ్లిచ్చిన తల్లి తలను పూజ గదిలోని చెక్క బల్లకేసి కొట్టాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె నేలపై పడిపోయింది. ఇంతలో ఇంటికొచ్చిన ఆమె భర్త త్రిమూర్తులు, బంధువులు 108కి ఫోన్ చేసి అంబులెన్స్‌లో కాకినాడలోని ప్రభుత్వాసుపత్రి (జీజీహెచ్)కి తీసుకువెళ్లారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న నాగమణి ఆరోగ్యం విషమించడంతో ఆదివారం ఉదయం మృతిచెందింది. పిఠాపురం సీఐ శ్రీనివాస్, ఎస్సై లోకేశ్ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి మెహదీపట్నంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగం ఒక యువకుడి ఆయువు తీసిన ఘటన బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు పరిధిలో శనివారం చోటుచేసుకుంది