
ఇంటర్నెట్‌డెస్క్: ‘రాజు వెడ్స్ రాంబాయి’ (Raju Weds Rambai) ఫేం యువ నటుడు అఖిల్ రాజ్ (Akhil Raj)కు ఒక డెలివరీ బాయ్‌కూ మధ్య జరిగిన గొడవ సామాజిక మధ్యమాల వేదికగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. డెలివరీ బాయ్‌పై అఖిల్ దాడి (actor akhil raj delivery boy issues) చేసినట్లు పోస్టులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో అఖిల్ స్పందించారు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ‘‘మా ఇంటి ఎదురుగా ఉన్న చేలం రెసిడెన్సీ ఫ్లాట్ నెం.201లో ఇవ్వాల్సిన పార్సిల్‌ను రమేశ్ అనే డెలివరీ బాయ్ మేము నివసిస్తున్న అరుణ రెసిడెన్సీ ఫ్లాట్ నెం.201లో ఇచ్చాడు. పార్సిల్‌పై చేలం రెసిడెన్సీ చిరునామా స్పష్టంగా ఉంది. మా ఇంట్లో ఉన్న నలుగురిలో ఎవరో ఒకరు ఆర్డర్ చేశారని మా నాన్నగారు దాన్ని తీసుకున్నారు. ఇదే విషయం మమ్మల్ని అడగడానికి నాన్న ఇంట్లోకి వచ్చేసరికి డెలివరీ బాయ్ వెళ్లిపోయాడు. ఆ విషయం మా అమ్మగారికి తెలియక ఆ ప్యాకెట్‌ను ఓపెన్ చేసేశారు. ఒక ఆర్డర్ డెలివరీ చేసినప్పుడు ఓటీపీ, పేరు, సరిచూసుకోవాల్సిన బాధ్యత డెలివరీ బాయ్‌దే. ఆ విషయంలో తప్పు చేశాడు. ఇంట్లో ఎవరూ ఆర్డర్ చేయలేదని తెలిసిన తర్వాత దాన్ని పక్కన పెట్టేశాం. దాదాపు 20 నిమిషాల తర్వాత ఆ అబ్బాయి మా ఫ్లాట్‌కు వచ్చి పార్సిల్ ఇవ్వమని అడిగాడు. ‘బ్రదర్ మీరు అడ్రస్ సరి చూసుకున్నారా’ అని అడిగా. అందుకు అతడు ‘లేదు నేను చూసుకోలేదు. ఇచ్చేశానంతే’ అని దురుసుగా జవాబిచ్చాడు’’ ‘‘ఇంతలో మా అమ్మ వచ్చి, ‘బాబూ తెలియక ఓపెన్ చేశాం. ఏమీ అనుకోకండి’ అని పార్సిల్ తిరిగి ఇచ్చారు. ఆ అబ్బాయి వెళ్తూ వెళ్తూ ‘ఫ్రీగా వస్తే ఓపెన్ చేసి తీసుకుంటారా’ అని మాట్లాడాడు. అమ్మను అంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా! నాకూ వచ్చింది. ‘సరిగా మాట్లాడు’ అంటూ హెచ్చరించా. ఇంతలో అతడు ‘నువ్వు