ఫ్యూచర్ సిటీలో ఉద్రిక్తత...జేసీబీలతో పంటల తొలగింపు
Actor ProfilePolitician

ఫ్యూచర్ సిటీలో ఉద్రిక్తత...జేసీబీలతో పంటల తొలగింపు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఫ్యూచర్ సిటీలో ఉద్రిక్తత...జేసీబీలతో పంటల తొలగింపు
TeluguOne29 Aug 2026
ఫ్యూచర్ సిటీలో ఉద్రిక్తత...జేసీబీలతో పంటల తొలగింపు

రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని కుర్మద్ది, మేడిపల్లి గ్రామాల్లో బుధవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు పేరుతో అధికారులు జేసీబీల సహాయంతో భూముల్లోకి ప్రవేశించి రైతులు వేసిన పంటలు, విత్తనాలను తొలగించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి సాగు చేసిన పంటలను ఎలాంటి నోటీ సులు ఇవ్వకుండా ధ్వంసం చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. భూములకు సంబంధించి కోర్టులో కేసు కొనసాగుతుండగా, స్టే అమల్లో ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు, పోలీసులు బలవంతంగా భూముల్లోకి ప్రవేశించారని వారు ఆరోపించారు. అధికారులను అడ్డుకునేందుకు రైతులు ప్రయత్నించగా, పోలీసులు వారిని అక్కడి నుంచి బలవంతంగా తొలగించారని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో రైతులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటూ పేద రైతుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నా రని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని, భూముల విషయంలో కోర్టు ఆదేశాలను గౌరవించాలని రైతులు డిమాండ్ చేశారు ఉపాధి హామీ స్థానంలో వీబీజీరామ్‌జీ...ఇక రోజుకు రూ.409