ఫీఫా వరల్డ్ కప్ 2026లో జర్మనీ ప్రపంచ రికార్డు.. అత్యధిక గోల్స్ చేసిన జట్టుగా సరికొత్త రికార్డు
Actor ProfileCelebrity

ఫీఫా వరల్డ్ కప్ 2026లో జర్మనీ ప్రపంచ రికార్డు.. అత్యధిక గోల్స్ చేసిన జట్టుగా సరికొత్త రికార్డు

Total News1
Movie Updates0
Sources1
ఫీఫా వరల్డ్ కప్ 2026లో జర్మనీ ప్రపంచ రికార్డు.. అత్యధిక గోల్స్ చేసిన జట్టుగా సరికొత్త రికార్డు
Zee Telugu15 Jun 2026
ఫీఫా వరల్డ్ కప్ 2026లో జర్మనీ ప్రపంచ రికార్డు.. అత్యధిక గోల్స్ చేసిన జట్టుగా సరికొత్త రికార్డు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Germany got highest Goals in FIFA world Cup 2026: ఫీఫా ప్రపంచ కప్ 2026లో జర్మనీ దూకుడు మాములుగా లేదు. మొత్తంగా ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లో అత్యధిక గోల్స్ చేసిన జట్టుగా వరల్డ్ రికార్డు నమోదు చేసింది. టోర్నమెంట్‌ను అద్భుతమైన ప్రదర్శనతో ప్రారంభించిన జర్మనీ గత చరిత్రలను తిరగరాస్తోంది. ఫీఫా ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ చేసిన జట్టుగా జర్మనీ నిలిచింది. క్యూరసోతో జరిగిన మ్యాచ్‌లో తమ ఏడవ గోల్ సాధించడం ద్వారా జర్మనీ ఈ చారిత్రాత్మక ఘనతను సాధించింది. 96 ఏళ్ల ఫీఫా ప్రపంచ కప్ చరిత్రలో, జర్మనీ ఇప్పటివరకు మొత్తం 239 గోల్స్ చేసింది. ఈ ఘనత ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన బ్రెజిల్‌ను కూడా అధిగమించింది. ఈ మెగా ఈవెంట్‌లో బ్రెజిల్ ఇప్పటివరకు మొత్తం 238 గోల్స్ చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా 152 గోల్స్‌తో జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది. ఇక ఫ్రాన్స్ 136 గోల్స్‌తో నాలుగవ స్థానంలో ఉంది. ప్రపంచ కప్‌లో 128 గోల్స్ చేసిన ఇటలీ ఐదవ స్థానంలో నిలిచింది. ఫీఫా ప్రపంచ కప్‌లో జర్మనీ కొత్త ప్రపంచ రికార్డు.. కురసోతో జరిగిన మ్యాచ్ ప్రారంభమైన మొదటి ఆరు నిమిషాల్లోనే తొలి గోల్ చేసి జర్మనీ ఆటపై తన పట్టు నిలబెట్టుకుంది. అయితే, కురసో వెంటనే స్కోరును 1-1తో సమం చేసింది. ఆ తర్వాత జర్మనీ వరుసగా గోల్స్ చేసింది. కార్నర్ కిక్ నుండి