
ఫిఫా ప్రపంచకప్ 2026లో ఆసియా జట్టు జపాన్ బోణీ కొట్టింది. ఆదివారం గ్రూప్-ఎఫ్‌లో ట్యునీషియాతో జరిగిన మ్యాచ్‌లో జపాన్ 4-0తో విజయం సాధించింది. నెదర్లాండ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ను డ్రా చేసుకున్న జపాన్.. ట్యునీషియాతో మ్యాచ్‌లో మాత్రం చెలరేగింది. జపాన్ తరఫున అయాసే ఉడా (ఆట 31,83వ నిమిషం) డబుల్ గోల్స్‌తో మెరవగా, దయిచీ కమదా (4వ నిమిషం), జున్యా ఇటో (69వ నిమిషం) గోల్స్ సాధించారు. కాగా ఫిఫా వరల్డ్‌కప్ చరిత్రలో జపాన్, ట్యునీషియాది 1000వ మ్యాచ్ కావడం విశేషం. కాగా మ్యాచ్‌లో ఓటమితో ట్యునీషియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఫిఫా ప్రపంచకప్ నుంచి వైదొలిగింది. ఇక జపాన్ తమ తదుపరి మ్యాచ్ స్వీడన్‌తో ఆడనుంది. ప్రస్తుతం నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న జపాన్ స్వీడన్‌పై గెలిచి గ్రూప్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఇదే గ్రూప్‌లో నెదర్లాండ్స్ 5-1 తేడాతో స్వీడన్‌ను చిత్తు చేసి టాప్‌లో కొనసాగుతోంది. Read: కవ్వించి తప్పు చేశారు.. వైభవ్ ప్రతీకారం! జంగిల్ థీమ్‌తో హీరోయిన్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు) గచ్చిబౌలిలో ప్రపంచంలోనే అతిపెద్ద జెంబే డ్రమ్ సర్కిల్ ఈవెంట్ (ఫొటోలు) ‘సాక్షి’ ఆధ్వర్యంలో యోగా వేడుకలు (ఫొటోలు) వైభవంగా ఎంపీ సుప్రియా సులే కుమార్తె వివాహం..హాజరైన ప్రముఖులు (ఫొటోలు) మెరుపు తీగలా కాజల్.. విషెస్ చెప్పినోళ్లకు థ్యాంక్స్ (ఫొటోలు) సూర్యవంశీ విధ్వసం.. 11బంతుల్లో హాఫ్ సెంచరీ సాయి కృష్ణ కేసులో సిట్ ఏర్పాటు.. CI నాగరాజు అరెస్ట్..?