
ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్ దశ ఆఖరి మ్యాచ్‌లో తీవ్ర ఉత్కంఠ రేపిన అల్జీరియా, ఆస్ట్రియా సమరం ఇప్పుడు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో పెద్ద వివాదానికి తెరలేపింది. కాన్సాస్ సిటీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ 3-3తో డ్రాగా ముగియడంతో అల్జీరియా, ఆస్ట్రియా రౌండ్ ఆఫ్ 32కు అర్హత సాధించాయి. స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్ దశ ఆఖరి మ్యాచ్‌లో తీవ్ర ఉత్కంఠ రేపిన అల్జీరియా, ఆస్ట్రియా సమరం ఇప్పుడు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో పెద్ద వివాదానికి తెరలేపింది. కాన్సాస్ సిటీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ 3-3తో డ్రాగా ముగిసింది. అల్జీరియా, ఆస్ట్రియా జట్లు చెరో పాయింట్ సాధించి రౌండ్ ఆఫ్ 32కు అర్హత సాధించాయి. అయితే, ఈ ఫలితంతో ఆసియా అగ్రశ్రేణి జట్టు ఇరాన్ టోర్నీ నుంచి దురదృష్టవశాత్తూ నిష్క్రమించింది. ఇరాన్ నాకౌట్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రియా తప్పక గెలవాల్సి ఉండేది. కానీ, మ్యాచ్ ముగిసిన తీరు చూస్తే ఇరు జట్లు కుమ్మక్కయ్యాయనే ఆరోపణలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. మ్యాచ్ అనంతరం అల్జీరియా కెప్టెన్ రియాద్ మహ్రెజ్ చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. మ్యాచ్ ముగింపు దశలో ఆస్ట్రియా డిఫెండర్లు పెద్దగా శ్రమించలేదని, అది తనకు 'ఇబ్బందికరంగా' (Awkward) అనిపించిందని మహ్రెజ్ స్వయంగా అంగీకరించాడు. 'నిజం చెప్పాలంటే ఆ సమయంలో పరిస్థితి కాస్త విచిత్రంగా అనిపించింది. మేము బంతిని వైడ్‌గా ఆడుతుంటే, వారు డిఫెన్స్‌కే పరిమితమయ్యారు. ఆఖరి నిమిషంలో నా సహచరుడు బంతిని పాస్ చేయగా, నేను గోల్ చేయాల్సి వచ్చింది. ఫుట్‌బాల్ క్రీడను గౌరవించి నేను ఆ గోల్ చేశాను. అయితే వారు కూడా వెనువెంటనే గోల్ చేసి నాకౌట్‌కు అర్హత సాధించడం వారికి మంచిదైంది. ఇద్దరం అర్హత సాధించడమే ఇక్కడ ముఖ్యం' అని మహ్రెజ్ వ్యాఖ్యానించాడు. కాగా, స్టాపేజ్ టైమ్ (90+3వ నిమిషం)లో మహ్రెజ్ గోల్ చేసి అల్జీరియాను 3-2తో ముందంజలో నిలిపాడు