ఫిఫా ప్రపంచ కప్ సంబరాల్లో విషాదం.. ఇద్దరి మృతి
Actor ProfilePolitician

ఫిఫా ప్రపంచ కప్ సంబరాల్లో విషాదం.. ఇద్దరి మృతి

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
శ్రీశాంత్ పై నిషేధం ఎత్తివేసిన కేరళ క్రికెట్ అసోసియేషన్
Andhra Jyothy28 Aug 2026
శ్రీశాంత్ పై నిషేధం ఎత్తివేసిన కేరళ క్రికెట్ అసోసియేషన్

కేరళ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేశారని టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌పై మూడేళ్ల నిషేధం పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ నిషేధాన్ని కేసీఏ

ఫిఫా ప్రపంచ కప్ సంబరాల్లో విషాదం.. ఇద్దరి మృతి
Andhra Jyothy28 Aug 2026
ఫిఫా ప్రపంచ కప్ సంబరాల్లో విషాదం.. ఇద్దరి మృతి

ఫిఫా ప్రపంచ కప్ 2026లో సహ ఆతిథ్య దేశం మెక్సికో రౌండ్ ఆఫ్ 16కి అర్హత సాధించింది. దీంతో అభిమానులు భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ వేడుకలు విషాదంగా మారాయి. బుధవారం జరిగిన ఈ సంబరాల్లో ఊపిరాడక ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026లో సహ ఆతిథ్య దేశం మెక్సికో రౌండ్ ఆఫ్ 16కి అర్హత సాధించింది. 2-0తేడాతో ఈక్వెడార్‌ను చిత్తు చేసింది. దాదాపు 40 ఏళ్ల తర్వాత ప్రపంచ కప్‌లో నాకౌట్ దశను దాటింది. దీంతో అభిమానులు భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ వేడుకలు విషాదంగా మారాయి. బుధవారం జరిగిన ఈ సంబరాల్లో ఊపిరాడక ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని మెక్సికో ప్రభుత్వం ధ్రువీకరించింది. మృతుల్లో 19 ఏళ్ల యువతి, 44 ఏళ్ల వ్యక్తి ఉన్నట్లు అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. అభిమానులు భారీ ఎత్తున సంబరాల్లో పాల్గొనడంతో ఉద్రిక్తత నెలకొంది. ఒకరినొకరు నెట్టేసుకోవడంతో ఊపిరాడక ఆ ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, ఈ ఘటనలో మరో వ్యక్తి కూడా మృతిచెందినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కానీ ఈ విషయాన్ని అధికారులు ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. ఈ ఘటనలో చాలా మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైభవ్ విషయంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన శ్రేయస్‌ 40 ఏళ్ల నాకౌట్ శాపానికి తెర.. ఈక్వెడార్‌ను చిత్తు చేసిన మెక్సికో