
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Sweden Crushed Tunisia: ఫిఫా వరల్డ్ కప్‌లో స్పీడన్ ప్రారంభ మ్యాచ్ లో తన సమీప ప్రత్యర్ధి ట్యూనీషియాపై 5 -1 తేడాతో గెలుపొంది మంచి శుభారంభం అందించింది. అంతేకాదు గ్రూపు ఎఫ్‌లో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచి సంచలనం రేపింది. మెక్సికోలోని గ్వాడలూప్ నగరంలో జరిగిన ఈ మ్యాచ్‌లో, యాస్సిన్ అయారీ లాంగ్ షాట్‌తో ఫస్ట్ గోల్ చేసి స్వీడన్ గెలుపుకు బాటలు వేశాడు. ఆ తర్వాత 30వ నిమిషాల్లో అలెగ్జాండర్ ఇసాక్ స్వీడన్ ఆధిక్యాన్ని రెడింతలు చేశాడు. హాఫ్ టైమ్‌కు కొద్దిసేపటి ముందు, ఒమర్ రెకిక్ ట్యునీషియాను గోల్ వైపు నడిపించి ఒకింత ఆధిక్యాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. కానీ కొద్ది సేపటికే విక్టర్ గ్యోకెరెస్ ఆధిక్యాన్ని తిరిగి రెండు గోల్స్‌కు చేర్చాడు. ఆ తర్వాత మట్టియాస్ స్వాన్‌బర్గ్ రంగంలోకి దిగి స్కోరును 4-1కి చేర్చగా, అయారీ చివరి గోల్ చేసి జట్టుకు ఏకపక్షంగా విజయాన్ని అందించడం విశేషం. క్వాలిఫైయింగ్ గ్రూప్‌లో అట్టడుగున స్వీడన్.. ఈ విజయం వరకు ఫిఫా వరల్డ్ కప్‌లో స్వీడన్ ప్రయాణం అంత సులభంగా ఈ స్థాయికి రాలేదు. స్వీడన్ తమ క్వాలిఫైయింగ్ గ్రూప్‌లో అట్టడుగున నిలిచి, ఫైనల్‌లో స్థానం సంపాదించుకోవడానికి నేషన్స్ లీగ్ ప్లేఆఫ్‌లపై ఆధారపడవలసి వచ్చింది. అయితే, తాజాగా స్వీడన్ జట్టు ఇప్పుడు ప్రపంచ కప్‌ను విజయంతో ప్రారంభించింది. ఇపుడు గ్రూప్ Fలో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఈ గ్రూప్‌లో జపాన్, నెదర్లాండ్స్ మధ్య జరిగిన రెండవ మ్యాచ్