
TG Student Missing in Finland: ఉన్నత విద్య కోసం ఫిన్లాండ్ దేశానికి వెళ్లిన తెలంగాణకు చెందిన మణిదీప్ రెడ్డి గుజ్జా అనే విద్యార్థి గత కొన్ని రోజులుగా అదృశ్యమయ్యాడు. మే 5వ తేదీ నుంచి అతడి ఆచూకీ లభించకపోవడంతో స్వస్థలంలో ఉన్న కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కుమారుడి నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్ గానీ, సమాచారం గానీ రాకపోవడంతో వారు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. Read also: Nagpur Forced Conversion Case: ఐఏఎఫ్ అధికారి భార్య కేసు.. మరో నిందితుడి అరెస్ట్ మణిదీప్ రెడ్డి ఫిన్లాండ్‌లోని లాహ్టి నగరంలో గల ప్రసిద్ధ ‘ఎల్‌యూటీ (LUT) యూనివర్సిటీ’లో చదువుతున్నాడు. అయితే, తమ కుమారుడు గల్లంతైన విషయంపై కాలేజీ యాజమాన్యం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై యూనివర్సిటీని సంప్రదించినప్పటికీ, వారు సరైన సమాధానం ఇవ్వడం లేదని, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని మణిదీప్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనిపించకుండా పోయిన తమ కుమారుడి ఆచూకీని వీలైనంత త్వరగా కనుగొనాలని మణిదీప్ రెడ్డి తల్లిదండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖతో పాటు, ఫిన్లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, అక్కడి అధికారులతో మాట్లాడి తమ బిడ్డను క్షేమంగా ఇంటికి చేర్చాలని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. CA Final Result May 2026: ICAI CA నేడే ఫలితాల విడుదల – డైరెక్ట్ లింక్ ఇదే! Iran-America War: ఇరాన్-యూఎస్ శాంతి ఒప్పందం: భారత ఆర్థిక వ్యవస్థకు ఊరట గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Jagtial District: జగిత్యాల జిల్లాలో విషాదం..కోతుల వీరంగంతో మహిళ మృతి Arjun Reddy : రాజకీయాల్లోకి మంత్రి పొంగులేటి