
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Honor X80 Pro Max Leaks Latest News: టెక్నాలజీ ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్‌ల బ్యాటరీ లైఫ్ అనేది ఎప్పుడు ఒక పెద్ద సవాలు గానే ఉంటూ వస్తోంది. కానీ ప్రముఖ మొబైల్ బ్రాండ్ హానర్ ఈ సమస్యకు శాశ్వతంగా పరిష్కారాన్ని చూపబోతోంది. మార్కెట్లోని సంచలనం సృష్టించేందుకు సరికొత్త హానర్ ఫ్లాగ్ షిప్ మోడల్ Honor X80 Pro Max స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ సిద్ధం చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ అతి త్వరలో విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోన్కు సంబంధించిన అధికారిక టీజర్ కూడా తాజాగా విడుదల కావడం విశేషం. ఇందులో భాగంగా అందుబాటులోకి వచ్చిన వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. చార్జింగ్ స్పీడ్.. ఈ స్మార్ట్‌ఫోన్ లో అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే.. దీనికి అద్భుతమైన శక్తివంతమైన బ్యాటరీ. లీకైన వివరాల ప్రకారం ఇది ఏకంగా 11,000mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. స్మార్ట్‌ఫోన్ చరిత్రలోనే ఎంత పెద్ద బ్యాటరీని పరిచయం చేయడం ఇదే తొలిసారి కావచ్చని మార్కెట్ ని గుణలు చర్చించుకుంటున్నారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు సాధారణ వినియోగం పై మూడు నుంచి ఐదు రోజులపాటు ఎలాంటి సమస్య లేకుండా పవర్ సపోర్ట్ అందిస్తుంది. అయితే, ఈ భారీ బ్యాటరీని చార్జ్ చేయడానికి వీలుగా 90W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను కూడా ఈ ఫోన్‌లో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.. ప్రీమియం డిజైన్.. కేవలం బ్యాటరీ మాత్రమే కాదు.. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ కూడా