ఫోన్ ఇవ్వలేదని యువకుడు బలవన్మరణం
Actor ProfilePolitician

ఫోన్ ఇవ్వలేదని యువకుడు బలవన్మరణం

Total News1
Movie Updates0
Sources1
ఫోన్ ఇవ్వలేదని యువకుడు బలవన్మరణం
Vaartha16 Jun 2026
ఫోన్ ఇవ్వలేదని యువకుడు బలవన్మరణం

Rajavommangi crime:పనులకు వెళ్లి సంపాదించిన డబ్బులతో మద్యం సేవించి దుర్వినియోగం చేయడంపై కొడుకును తండ్రి మండలించడంతో బాటు సెల్ ఫోన్ తండ్రి ఇవ్వలేదని మనస్తాపం చెంది పురుగులు మందు త్రాగిన గిరిజన యువకుడు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతూ మరణించిన సంఘటన. వివరాలు పోలవరం జిల్లా వంచంగి గ్రామానికి చెందిన కోసూరి రాంబాబు, కూటమ్మ దంపతులకు ఇద్దరు మగ సంతానం కలరు. మొదటి అబ్బాయి కోసూరి శివకుమార్ రెడ్డి ( 19) సం. వ్యవసాయ పనులు చేస్తూ వచ్చిన డబ్బులతో మద్యం సేవిస్తున్నాడు. Read also: Vivek Yadav: ఏపీలో ఓటర్ల జాబితా సవరణ.. కీలక అప్డేట్ ఇచ్చిన సీఈఓ వివేక్ యాదవ్ ఈనెల 12 తేదీ రాత్రి మద్యం సేవించి వచ్చి భోజనం చేయకుండా తండ్రిని సెల్ ఫోన్ అడగడంతో ఇవ్వనని అన్నాడు. భోజనం చేయకుండా మనస్తాపం చెంది అదే రోజు రాత్రి 11.30 ని. సమయంలో పురుగుమందు త్రాగడంతో కుటుంబీకులు ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. అక్కడ నుండి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యసేవలు పొందుతూ శివకుమార్ రెడ్డి మరణించాడు. తండ్రి రాంబాబు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్. ఐ చినబాబు తెలిపారు. సోమవారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబీకులు సమక్షంలో శవపంచనామా నిర్వహించడం పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Kollu Ravindra: వైసీపీ పాలనలో మద్యం విధానాల వల్ల రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం: కొల్లు రవీంద్ర Pralhad Joshi Vijayawada Visit: నేడు విజయవాడకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి Vivek Yadav: ఏపీలో ఓటర్ల జాబితా సవరణ.. కీలక అప్డేట్