
Father's Day Quotes:ప్రతి సంవత్సరం జూన్ మూడో ఆదివారం ఫాదర్స్ డేను జరుపుకుంటారు. ఈ ఏడాది ఫాదర్స్ డే జూన్ 21న వచ్చింది. మన జీవితంలో తండ్రి పాత్ర ఎంతో గొప్పది. కుటుంబం కోసం కష్టపడుతూ పిల్లల భవిష్యత్తును నిర్మించే వ్యక్తి తండ్రి. ఆయన ప్రేమను, త్యాగాలను గుర్తు చేసుకునే ప్రత్యేక రోజే ఫాదర్స్ డే. ఈ సందర్భంగా చాలామంది తమ తండ్రికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అలాగే వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కోట్స్, మెసేజ్‌లు, HD చిత్రాలను షేర్ చేస్తున్నారు. ఫాదర్స్ డే సందర్భంగా పంపడానికి కొన్ని అందమైన సందేశాలు చూడం ప్రియమైన నాన్నకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు. నా జీవితంలో నేను వేసే ప్రతి అడుగులో మీ ప్రేమ, మీ ప్రోత్సాహం, మీ ఆశీర్వాదం నాతోనే ఉంటాయి. నేను చిన్నప్పటి నుంచి నన్ను కాపాడుతూ, మంచి చెడులను నేర్పిస్తూ, జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలో చూపించిన గొప్ప వ్యక్తి మీరు. మీ కష్టం, త్యాగం, కుటుంబం కోసం మీరు చేసిన ప్రతి ప్రయత్నం నాకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. మీలాంటి తండ్రి దొరకడం నా అదృష్టం. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. నాన్నా... మీరు నా జీవితంలో కేవలం ఒక తండ్రి మాత్రమే కాదు, నా మొదటి హీరో, నా గురువు, నా బలం. నేను పడిపోయినప్పుడు నన్ను లేపిన చేయి మీది, నేను భయపడినప్పుడు ధైర్యం చెప్పిన గొంతు మీది. మీ ప్రేమను మీరు మాటల్లో ఎక్కువగా చెప్పకపోయినా, మీ ప్రతి చర్యలో అది కనిపిస్తుంది. నా సంతోషం కోసం మీరు చేసిన త్యాగాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ నాపై ఉండాలని కోరుకుంటూ ఈ ఫాదర్స్ డే సందర్భంగా మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు నా జీవితంలో ఉండటం నా