ఫీడ్ ధరల మంట... త్వరలో చేపలు
Actor ProfilePolitician

ఫీడ్ ధరల మంట... త్వరలో చేపలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఫీడ్ ధరల మంట... త్వరలో చేపలు, రొయ్యల రేట్లు పెరగబోతున్నాయ్
10TV Telugu23 Aug 2026
ఫీడ్ ధరల మంట... త్వరలో చేపలు, రొయ్యల రేట్లు పెరగబోతున్నాయ్

Aquaculture Farmers : ఫీడ్ ధరల పెంపుపై ఆక్వా రైతులు ఉద్యమ బాటపట్టారు. ఫీడ్ ధరలు తగ్గించేవరకు పోరాటం ఆగదని హెచ్చరిస్తున్నారు. ఆక్వా రైతుల ఉద్యమం ఎఫెక్ట్.. ఇప్పుడు సాధారణ వినియోగదారుల జేబుపై పడేలా కనిపిస్తోంది. ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా మేత ధరలను పెంచడమే దీనికి కారణంగా చెప్పవచ్చు. ఆక్వా సాగు వ్యయం భారీగా పెరిగిపోవడంపై రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ భారాన్ని ఇక భరించలేమంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆక్వా రైతులు పట్టుబడులను నిలిపివేసి ఉద్యమాన్ని చేపట్టారు. పెరిగిన ఖర్చులతో సాగు కొనసాగించడం కష్టమని వాపోతున్నారు. అయితే, రైతులకు మద్ధతుగా ఆఖ్వా ఫీడ్ డీలర్లు కూడా షాపులు మూసివేసి ఉద్యమంలో పాల్గొనడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఫీడ్ ధరల పెంపుపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఫీడ్, మందుల ధరలను నియంత్రించని పక్షంలో దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే చేపలు, రొయ్యల ఉత్పత్తి తగ్గే అవకాశం కనిపిస్తోంది. దాంతో మార్కెట్లో చేపలు, రొయ్యల ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో ఆక్వా రంగంలో నెలకొన్న ఈ సంక్షోభం రైతులకే మాత్రమే కాదు.. సామాన్య వినియోగదారులపై కూడా ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. ఆక్వా రైతుల ఆందోళనలు ఉధృతం : రాష్ట్రంలో ఆక్వా రైతుల ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ఫీడ్ కంపెనీల సిండికేట్ కు వ్యతిరేకంగా ఆక్వా సాగుదారులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. పెంచిన మేత ధరలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆక్వా పెట్టుబడులను పూర్తిగా నిలిపివేశారు. ఈసారి రైతులకు మద్దుతుగా ఆక్వా ఫీడ్ డీలర్స్ కూడా రంగంలోకి దిగారు. దాంతో ఉద్యమ తీవ్రత మరింత పెరిగింది. ఫీడ్ కంపెనీల ఏకపక్ష నిర్ణయాల వల్ల రైతులతో పాటు తాము కూడా తీవ్రంగా నష్టపోతున్నామని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Read Also : Gudivada Amarnath : ‘ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోను.. ఇక రౌండ్