టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. డార్లింగ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ డ్రామా 'ఫౌజీ' కి సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమా విశేషాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అభిమానుల కోసం చిత్ర యూనిట్ ఒక బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇప్పటివరకు ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించి కేవలం టైటిల్ మరియు ఒక చిన్న ప్రీ-లుక్ మాత్రమే మేకర్స్ పంచుకున్నారు. అందులో ప్రభాస్ పూర్తి రూపాన్ని దాచిపెట్టడంతో, అసలు ఈ సినిమాలో రెబల్ స్టార్ వింటేజ్ లుక్ ఎలా ఉండబోతోందనే క్యూరియాసిటీ అందరిలోనూ పీక్స్‌కు చేరింది. అయితే ఈ ఉత్కంఠకు తెరదించుతూ త్వరలోనే ఫుల్ గ్లింప్స్ లేదా టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ భారీ యాక్షన్ లవ్ స్టోరీని మలుస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతూ, దాదాపు చివరి దశకు చేరుకున్నట్లు టాక్. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ విషయంలో గేర్ మార్చాలని చిత్రబృందం భావిస్తోంది. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం, ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా 'ఫౌజీ' చిత్ర టీజర్‌ను లాంచ్ చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేసినట్లు వినికిడి. ఈ టీజర్ విడుదలైనప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్‌తో హోరెత్తించనున్నారు. సినిమాలో నటించే కీలక పాత్రల పరిచయ వీడియోలతో పాటు, పాటలను కూడా ఒకదాని తర్వాత ఒకటి విడుదల చేస్తూ హైప్ పెంచాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ గురించి కూడా ఒక ఆసక్తికరమైన లీక్ బయటకు వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను
Actor ProfileActor
ఫౌజీ టీజ ర్ రిలీజ్
Total News1
Movie Updates0
Sources1
TeluguOne•14 Jun 2026
ఫౌజీ టీజ ర్ రిలీజ్ , మూవీ రిలీజ్ డేట్స్ ఫిక్స్ అయిపోయాయి