
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Gold Rate Today: గత రెండు రోజులుగా భారీగా పెరుగుదల నమోదు చేసిన బంగారం ధరలు మళ్లీ కాస్త తగ్గాయి. సోమవారం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,43,940గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 1, 31, 940గా ఉంది. వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ. 2,44,900గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా విలువైన లోహాల ధరలు నిరంతరం పడిపోవడం.. గత ట్రేడింగ్ లో డాలర్ బలపడటం వంటి వాటి ప్రభావం ఇప్పుడు దేశీయ మార్కెట్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గడంతో దేశంలో వరుసగా మూడో ట్రేడింగ్ రోజు కూడా బంగారం ధరలు పడిపోయాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, 99.9శాతం స్వచ్ఛత కలిగిన 24-క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 2,800 తగ్గి రూ. 1,43,940కి చేరింది. గత మూడు నెలల్లో ఇదే అత్యల్ప స్థాయి. అంతకుముందు ట్రేడింగ్ సెషన్‌లో, బంగారం 10 గ్రాములకు రూ. 1,48,100 వద్ద ముగిసింది. ప్రపంచ మార్కెట్‌లో కూడా బంగారంపై ఒత్తిడి కొనసాగింది. స్పాట్ గోల్డ్, నవంబర్ 2025 తర్వాత తొలిసారిగా ఔన్సుకు $4,000 కీలక స్థాయి కంటే దిగువకు పడిపోయింది. దీని ధర రూ. 21.15 లేదా 0.53 శాతం తగ్గి ఔన్సుకు $3,978.06కి చేరింది. డాలర్ బలం, అధిక వడ్డీ రేట్లు దీర్ఘకాలం పాటు కొనసాగుతాయనే భయం బంగారం ధరలపై ఒత్తిడిని పెంచుతున్నాయి. పెట్టుబడిదారులు ప్రస్తుతం డాలర్‌ను సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారని మార్కెట్ నిపుణులు చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్‌లో కొనసాగుతున్న