పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్. బంగారం దాదాపు రూ.20వేలకుపైగా దిగొచ్చింది. గత కొన్ని వారాలుగా రికార్డు స్థాయిలకు చేరి ఆందోళనకు గురిచేసిన గోల్డ్ రేట్లు…క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే ఈరోజు కూడా ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే బంగారం ధరల్లో భారీ మార్పులు కనిపించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో వచ్చిన పరిణామాలు, డాలర్, పెట్టుబడిదారుల వ్యూహాల్లో మార్పులు వంటి కారణాలతో బంగారం ధరలు ఒక్కరోజులోనే గణనీయంగా తగ్గాయి. దీంతో నగలు కొనాలనుకునేవారు, పెట్టుబడి కోసం గోల్డ్‌లో డబ్బు పెట్టాలనుకునేవారు ఈ పరిణామంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర ప్రస్తుతం రూ.1,40,130గా ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే రూ.2,780 తగ్గింది. ఒక్కరోజులోనే దాదాపు మూడు వేల రూపాయల వరకు పడిపోయింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగా క్షీణించింది. ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.1,28,450గా ఉండగా, నిన్నటితో పోలిస్తే రూ.2,550 తగ్గింది. అలాగే 18 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.1,05,100గా ఉండగా, రూ.2,080 తగ్గుదల నమోదైంది. బంగారం మాత్రమే కాదు... వెండి ధర కూడా భారీగా పడిపోయింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,30,000 వద్ద కొనసాగుతుండగా, నిన్నటి ధరతో పోలిస్తే ఏకంగా రూ.10,000 తగ్గింది. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లలో కనిపిస్తున్న మార్పులు. సాధారణంగా ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి పెరిగితే పెట్టుబడిదారులు బంగారం వైపు పరుగులు తీస్తారు. కానీ ప్రస్తుతం కొంతమంది పెట్టుబడిదారులు తమ డబ్బును ఇతర ఆస్తుల్లో పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో గోల్డ్‌పై ఒత్తిడి పెరిగింది. మరోవైపు అమెరికా డాలర్ బలపడటం కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతోంది. సాధారణంగా డాలర్ విలువ పెరిగితే బంగారం కొనుగోలు ఖర్చు
Actor ProfileActor
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్..రూ.20వేలు పతనమైన గోల్డ్
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Asianet News Telugu•19 Jul 2026
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్..రూ.20వేలు పతనమైన గోల్డ్, సిల్వర్