
బులియన్ మార్కెట్ ‘బేర్’మంటోంది. ప్రస్తుతం 4,100 డాలర్లకు చేరువలో ట్రేడవుతున్న ఔన్స్ (31గ్రాములు) మేలిమి బంగారం ధర త్వరలో 3,800 డాలర్లకు దిగివచ్చే అవకాశం ఉందని... న్యూఢిల్లీ: బులియన్ మార్కెట్ ‘బేర్’మంటోంది. ప్రస్తుతం 4,100 డాలర్లకు చేరువలో ట్రేడవుతున్న ఔన్స్ (31గ్రాములు) మేలిమి బంగారం ధర త్వరలో 3,800 డాలర్లకు దిగివచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. అయితే ఇది అమెరికా నిరుద్యోగం, వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి ధర 3,800 డాలర్లకు వస్తే, భారత్‌లోనూ 10 గ్రాముల పసిడి ధర రూ.1.35 లక్షల నుంచి రూ.1.40 లక్షల మధ్య ట్రేడవుతుందని మార్కెట్ వర్గాల అంచనా. ఈ వార్తలతో ఆగస్టులో డెలివరీ ఇచ్చే 10 గ్రాముల పసిడి ధర బుధవారం ఎంసీఎక్స్‌లో రూ.1,701 నష్టపోయి రూ.1,40,830కి చేరింది. వెండి రూ.5,000 అప్: విలువైన లోహాలు బుధవారం మిశ్రమ ట్రెండ్‌ను కనబరిచాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం ధర 10 గ్రాములపై రూ.1,300 తగ్గుదలతో రూ.1,44,500కు దిగివచ్చింది. కిలో వెండి మాత్రం మరో రూ.5,000 పెరిగి రూ.2.35 లక్షలకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) పసిడి ధర ఒక దశలో 3,986 డాలర్లకు పడిపోగా.. సిల్వర్ 58 డాలర్లకు దిగివచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ధర వరుసగా నాలుగు నెలలుగా పతనమవుతూ వస్తోంది. జూన్‌లో 12 శాతం క్షీణించింది. 2008 తర్వాత ఇదే అతిపెద్ద నెలవారీ తగ్గుదల. యూఏఈ దిగుమతులకు ఉపశమనం: మరోవైపు భారత-యూఏఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో పేర్కొన్న టారిఫ్ రేట్ కోటా (టీఆర్‌క్యూ) కింద పసిడి దిగుమతులకు అనుమతులు ఉన్న దిగుమతిదారులకు ప్రభుత్వం పెద్ద ఉపశమనం కల్పించింది. వారు తమకు ఉన్న లైసెన్సు కింద ఈ ఏడాది సెప్టెంబరు నెలాఖరు వరకు పసిడి దిగుమతి చేసుకోవచ్చని విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ (డీజీఎ్‌ఫటీ) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ