పవన్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్.. అధికారికంగా 'ఓజీ2' ప్రకటన.. ఆసక్తి రేపుతున్న వీడియో
Actor ProfileActor

పవన్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్.. అధికారికంగా 'ఓజీ2' ప్రకటన.. ఆసక్తి రేపుతున్న వీడియో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పవన్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్.. అధికారికంగా 'ఓజీ2' ప్రకటన.. ఆసక్తి రేపుతున్న వీడియో
AP7AM20 Jul 2026
పవన్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్.. అధికారికంగా 'ఓజీ2' ప్రకటన.. ఆసక్తి రేపుతున్న వీడియో

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు చిత్రబృందం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆయన హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'దే కాల్ హిమ్ ఓజీ'కి సీక్వెల్ రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కేవలం సీక్వెల్ మాత్రమే కాకుండా, ఇది 'ఓజీ యూనివర్స్'లో భాగంగా ఉండనుందని స్పష్టం చేసింది. ఈ మేరకు పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్ రానున్నట్లు వెల్లడించారు.పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తమ 'ఎక్స్' ఖాతాలో ఓ ప్రత్యేక వీడియోను పంచుకుంది. ఇందులో దర్శకుడు సుజీత్, పవన్ కల్యాణ్ 'ఓజీ' ఫ్రాంచైజీలోని రెండో భాగం గురించి చర్చిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. "తుఫానుకు ముందు ప్రశాంతత ఉంటుంది. గంభీర చెప్పని కథ ఇప్పుడు ఆవిష్కృతం కాబోతోంది" అని నిర్మాణ సంస్థ పేర్కొంది. సుజీత్ ఆలోచనలకు, కథనానికి ముగ్ధుడైన పవన్, తన వైపు నుంచి కావాల్సినదంతా సిద్ధంగా ఉంటుందని హామీ ఇవ్వడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది.ఈ సీక్వెల్ కేవలం ఓ కొనసాగింపు చిత్రం కాదని, అనేక పాత్రలు, వాటికి సంబంధించిన లోతైన కథలతో కూడిన ఓ పెద్ద సినిమాటిక్ అనుభూతిని ఇస్తుందని వీడియో ద్వారా తెలుస్తోంది. 'ఓజీ యూనివర్స్' పరిధిని వివరిస్తూ, సుజీత్ కొన్ని ఆసక్తికరమైన అంశాలను పవన్‌తో పంచుకున్నారు. సినిమాలో మంచు నెమ్మదిగా రక్తంగా మారే సన్నివేశం, ఓ రహస్యమైన 'అవుట్‌సైడర్' పాత్ర, 'ఓజీ' పెంపుడు జంతువు ప్రాముఖ్యత వంటి విషయాలను వివరించారు. 'ఓజీ 2'లో ఓ సన్నివేశం 'ఐకానిక్ విజువల్'గా నిలిచిపోతుందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం ఇప్పుడు అభిమానుల్లో