పవనిజం బ్యాక్ డ్రాప్ లో రైతుల పోరాటం.. కేవలం 21 రోజుల్లోనే షూటింగ్
Actor ProfileActor

పవనిజం బ్యాక్ డ్రాప్ లో రైతుల పోరాటం.. కేవలం 21 రోజుల్లోనే షూటింగ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పవనిజం బ్యాక్ డ్రాప్ లో రైతుల పోరాటం.. కేవలం 21 రోజుల్లోనే షూటింగ్
NTV Telugu7 Aug 2026
పవనిజం బ్యాక్ డ్రాప్ లో రైతుల పోరాటం.. కేవలం 21 రోజుల్లోనే షూటింగ్

పవనిజం ఆరా, పల్లెటూరి రైతుల జీవన విధానాన్ని జోడిస్తూ అవుట్ అండ్ అవుట్ రియలిస్టిక్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న చిత్రం “హే చికీతా”. అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్లపై ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ‘గరుడవేగ’ అంజి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రైటర్ ధన్ రాజ్ లెక్కల ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్, తన్మయి కుషి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అఫీషియల్ టీజర్‌ను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్, డైరెక్టర్ జి. నాగేశ్వర్ రెడ్డి గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు సి. కళ్యాణ్, దామోదర్ ప్రసాద్, రామసత్య నారాయణ మరియు దర్శకులు దశరథ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ వేడుకలో దర్శకుడు ధన్ రాజ్ లెక్కల మాట్లాడుతూ “నేను పవన్ కళ్యాణ్ కి వీరాభిమానిని. సాధారణంగా ఆయన ప్రతి సినిమాలో ఇంట్రో సాంగ్‌లో మూడు నిమిషాల పాటు సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తారు. నేను అదే పాయింట్ ఇన్స్పిరేషన్‌గా తీసుకుని.. మా ఊర్లో ఉండే ఒక ఐదుగురు పవన్ ఫ్యాన్స్ ఏం చేశారు? అనే కథతో, రైతుల సమస్యల చుట్టూ ఈ మూడు గంటల సినిమాను అద్భుతంగా రాసుకున్నాను. రైతుల గురించి ఆలోచించే ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం నచ్చుతుంది” అని ధీమా వ్యక్తం చేశారు. ఈ పల్లెటూరి డ్రామా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది