
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. మొదట ఆయన నందినిని మ్యారేజ్ చేసుకున్నారు. వీరిది అరెంజ్ మ్యారేజ్. 1997లో పెళ్లి చేసుకుంటే రెండేళ్లకి విడిపోయారు. కాకపోతే 2008లో విడాకులు మంజూరు అయ్యాయి. ఆ తర్వాత 2009లో రేణు దేశాయ్‌ని మ్యారేజ్ చేసుకున్నారు పవన్. వీరికి అకీరా నందన్, ఆధ్యలు జన్మించారు. మూడేళ్లకి వీరిద్దరు విడిపోయారు. అనంతరం రష్యా నటి అన్నా లెజినోవాని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఇదిలా ఉంటే రేణు దేశాయ్ ఇప్పుడు ఎక్కడుంది? ఏంచేస్తుందో అందరికి తెలిసిందే. ఆమె పబ్లిక్ లో ఉంటుంది. తరచూ అనేక విషయాలపై మాట్లాడుతుంది. అయితే పవన్ మొదటి భార్య నందిని ఎక్కడుంది? ఇప్పుడు ఏం చేస్తుందనేది పెద్ద మిస్టరీ. ఈ విషయాలు తాజాగా బయటకు వచ్చాయి. షాకింగ్ నిజాలు తెలిసిపోయాయి. ప్రముఖ దర్శకుడు గీతా కృష్ణ ఈ విషయాన్ని వెల్లడించారు. నందిని.. గీతా కృష్ణ వాళ్ల బంధువుల అమ్మాయి అట. పత్తిపాటి పుల్లారావు బంధువుల అమ్మాయి అట. వాళ్లది చాలా పెద్ద ఫ్యామిలీ అని, వాళ్ల తాత పత్తిపాటి గంగరాజు, వాళ్లది పోలవరం అని, పత్తిపాటి పుల్లారావు సిస్టర్ డాటరే నందిని అని చెప్పారు. పవన్ కళ్యాణ్ తో విడిపోయాక మళ్లీ సినిమా వాళ్లనే పెళ్లి చేసుకోవాలనుకున్నారట. కానీ గీతా కృష్ణ వద్దు అని చెప్పాడట. దీంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారట. ఆ తర్వాత డాక్టర్‌ని పెళ్లి చేసుకుందట నందిని. ఇప్పుడు వాళ్లు అమెరికాలో సెటిల్ అయ్యారట. తను కూడా అమెరికా బిజినెస్ చేస్తుందని, ఇప్పుడు బాగా సెటిల్ అయ్యిందని సమాచారం. పిల్లలు, ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారని, ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారని వెల్లడించారు గీతా కృష్ణ. రెండో పెళ్లికి తన పేరుని జాహ్నవిగా మార్చుకున్నట్టు సమాచారం. అయితే మరో ఆసక్తికర విషయాన్ని ఆయన వెల్లడించారు. పవన్‌తో నందిని విడిపోయినప్పుడు ఆమెకి పవన్ భరణం గట్టిగానే ఇచ్చాడట. మొదట్లో