
హన్మకొండ : జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శించే అర్హత తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు లేదని జనసేనపార్టీ నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు సోమవారం మీడియాతో మాట్లాడుతూ హన్మకొండ పర్యటనలో శనివారం జనసేనాని పట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ చేసి తీహార్ జైలులో ఉన్న కవిత నీతులు చెప్పడం హాస్యపదంగా ఉందన్నారు. కన్న తండ్రికే వెన్నుపోటు పొడిచి అధికారం కాంక్షతో కవిత మతితప్పి మాట్లాడుతుందన్నారు. రాజకీయ ఉనికి కోసం తెలంగాణ కార్డు పట్టుకొని తిరుగుతున్నందని పేర్కొన్నారు. కవిత ఎన్ని వేషాలు వేసిన తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వరంగల్ తూర్పు పిఓసి సభ్యులు గడ్డం రాకేష్, జిల్లా నాయకులు కొల్లూరి అనుదీప్, అమంచ సునీల్, పద్మజ రెడ్డి, గొపు నవీన్, ప్రసన్న కుమార్, దయాకర్, ప్రశాంత్ రెడ్డి, కొలిపాక వంశీ కృష్ణ, ఫరీద్, షేక్ ఆన్సర్ తదితరులు ఉన్నారు