పవన్ కళ్యాణ్ కు మానసిక పరీక్షలు అవసరం
Actor ProfilePolitician

పవన్ కళ్యాణ్ కు మానసిక పరీక్షలు అవసరం

Total News1
Movie Updates0
Sources1
పవన్ కళ్యాణ్ కు మానసిక పరీక్షలు అవసరం
Oneindia Telugu17 Jun 2026
పవన్ కళ్యాణ్ కు మానసిక పరీక్షలు అవసరం

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) జాతీయ అధికార ప్రతినిధి ఆకాశ్ కొల్లూరు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ ప్రవర్తన, ఆయన రాజకీయ వైఖరిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. ఆయనకు అసలు రాజకీయ, మానసిక స్థిరత్వం లేదంటూ మండిపడ్డారు. తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తూ, ఇక్కడి సెంటిమెంట్‌ను తీవ్రవాదంతో పోల్చితే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని, వచ్చే ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెబుతారని ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు.జాతీయ మీడియా రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చి, టి.ఆర్.ఎస్ (TRS) జాతీయ ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన ఆకాశ్ కొల్లూరు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయితెలంగాణ సెంటిమెంట్‌పై దాడి.. సహించేది లేదుతెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనేది ఊరికే రాలేదని, సుమారు 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, 1200 మంది అమరవీరుల రక్తతర్పణం వల్ల సాకారమైన సత్యమని ఆకాశ్ కొల్లూరు గుర్తు చేశారు. ఒకవైపు అమరవీరులకు నివాళులు అర్పిస్తానని చెబుతూనే, మరోవైపు జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం నాడే ఇక్కడి ప్రాంతీయ సెంటిమెంట్‌ను తీవ్రవాదం, అసాంఘిక శక్తులు, దేశ వ్యతిరేకతతో పవన్ కళ్యాణ్ పోల్చడం అత్యంత దుర్మార్గమన్నారు. ఇలాంటి కపట బుద్ధిని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ క్షమించరని, గతంలోనే పవన్‌ను తిరస్కరించిన ఇక్కడి ఓటర్లు, వచ్చే ఎన్నికల్లో ఆయనకు మరోసారి శాశ్వతంగా తలుపులు మూసేయడం ఖాయమని హెచ్చరించారు.దేశంలోనే అత్యంత అస్థిరమైన నాయకుడుభారతదేశ రాజకీయ చరిత్రలోనే పవన్ కళ్యాణ్ అంతటి పరస్పర విరుద్ధమైన, అస్థిరమైన నాయకుడిని ఎవరూ చూసి ఉండరని ఆకాశ్ ఎద్దేవా చేశారు. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయని పేర్కొంటూ.. 2007లోనే నరేంద్ర మోదీ దేశ ప్రధాని అవుతారని తనకు తెలుసని పవన్ చెబుతుంటారని, మరి అదే నిజమైతే సొంత పార్టీ పెట్టడం, ఆపై టీడీపీతో, ఆ తర్వాత వామపక్షాలతో పొత్తులు పెట్టుకుని, చివరకు మళ్లీ బీజేపీ