పవన్ కల్యాణ్ కు ముంబయిలో వైద్య పరీక్షలు.. అసలు ప్రాబ్లం ఇదే.. బండ్ల గణేశ్ ఎమోషనల్ పోస్ట్
Actor ProfilePolitician

పవన్ కల్యాణ్ కు ముంబయిలో వైద్య పరీక్షలు.. అసలు ప్రాబ్లం ఇదే.. బండ్ల గణేశ్ ఎమోషనల్ పోస్ట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పవన్ కల్యాణ్ కు ముంబయిలో వైద్య పరీక్షలు.. అసలు ప్రాబ్లం ఇదే.. బండ్ల గణేశ్ ఎమోషనల్ పోస్ట్
10TV Telugu20 Aug 2026
పవన్ కల్యాణ్ కు ముంబయిలో వైద్య పరీక్షలు.. అసలు ప్రాబ్లం ఇదే.. బండ్ల గణేశ్ ఎమోషనల్ పోస్ట్

Pawan Kalyan Health : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోమవారం ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయన సతీమణి అన్నా కొణిదెలతో కలిసి ఆస్పత్రికి వెళ్లిన పవన్‌కు అక్కడి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. పవన్ కల్యాణ్ కొంత కాలంగా రొటేటర్ కఫ్‌, రెండు భుజాల కండరాల గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. భుజాల కండరాలు చిట్లడంతో పరిస్థితి మరింత జఠిలంగా మారింది. పవన్ ఎదుర్కొంటున్న సమస్యను పరీక్షించిన వైద్యులు.. రొటేటర్ కఫ్ తో పాటు భుజాల కండరాలు తీవ్రంగా గాయపడినట్లు నిర్ధారించారు. వెంటనే శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు పవన్ కల్యాన్‌కు సూచించారు. అయితే, ముందుగా నిర్ణయించిన అధికారిక కార్యక్రమాలు, పాలనాపరమైన కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తరువాత శస్త్ర చికిత్స చేయించుకోవాలని పవన్ నిర్ణయించుకున్నారు. ఇదిలాఉంటే.. పవన్ కల్యాణ్ వైద్య పరీక్షల వేళ సినీ నిర్మాత బండ్ల గణేశ్ ఆసక్తికర పోస్టు చేశారు. బండ్ల గణేష్ ట్వీట్ ప్రకారం.. ‘ఒక సంవత్సరం కాదు.. రెండు సంవత్సరాలు కాదు.. దాదాపు పదిహేనేళ్లుగా మీరు నడుము నొప్పి, భుజం నొప్పితో ఎంత నరకం అనుభవించారో తలచుకుంటే నా గుండె బరువెక్కిపోయింది. చిన్న పంటి నొప్పి వచ్చినా మనిషి విలవిల్లాడిపోతాడు. అలాంటిది మీరు ఇన్ని సంవత్సరాలు ఆ బాధను చిరునవ్వు వెనుక దాచుకుని జీవించడం నిజంగా అసాధారణం. నాకు ఈ రోజుకూడా గబ్బర్ సింగ్ షూటింగ్ రోజులు కళ్లముందే కనిపిస్తున్నాయి. గుజరాత్‌లో జరిగిన ఆ ప్రమాదం.. గుర్రం మీద నుంచి పడిపోయిన ఆ క్షణం.. వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పిన సందర్భం.. ఇవన్నీ ఇప్పటికీ నా మనసును వెంటాడుతూనే ఉన్నాయి. ఆ సమయంలో మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఒక హీరో తీసుకున్న నిర్ణయం కాదు. మాటకు ప్రాణం ఇచ్చే మహామనిషి తీసుకున్న నిర్ణయం.’’ “ముందు సినిమా పూర్తి చేద్దాం… నిర్మాతకు ఇబ్బంది