
ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న హనుమకొండ బాలుడు నిరంజన్ కుటుంబానికి చెప్పినట్లుగానే.. రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు నటుడు, నిర్మాత బండ్ల గణేష్. స్వయంగా ఆయనే బాబు ఇంటికి వెళ్లి చెక్‌ని అందజేశారు. ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న హనుమకొండ బాలుడు నిరంజన్ (Pawan Kalyan Fan Niranjan) కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రోజు (శనివారం) హనుమకొండ, హనుమాన్ నగర్‌లోని బాలుడి ఇంటికి బండ్ల గణేష్ (Bandla Ganesh) వెళ్లారు. అక్కడ నిరంజన్ అండ్ ఫ్యామిలీతో మాట్లాడి.. బాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నిరంజన్ తల్లిదండ్రులు రాంగోపాల్ చారి, మానసలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ తరఫున 5 లక్షల రూపాయల చెక్‌ను నిరంజన్ తల్లిదండ్రులకు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 17 సంవత్సరాల నిరంజన్ అనే బాబు జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడని, తన దైవసమానులైన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆ బాబుని పలకరించడానికి హనుమకొండ వస్తున్నారని తెలిసి.. తనకు ఈ విషయం దృష్టికి వచ్చిందని బండ్ల గణేష్ చెప్పారు. ఆ బాబు పక్కనే ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) సినిమాలోని హీరో ఫోటో చూడగానే తన హృదయం చలించిందని, తన చేతనైన సహాయం ఉడతా భక్తిగా ఆ బాబుకు చేయాలనిపించిందని పేర్కొన్నారు. తామంతా ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి పవన్ కళ్యాణే కారణమని ఆయన అన్నారు. ప్రస్తుతం తన కూతురి వివాహ పనుల్లో విపరీతమైన బిజీగా ఉన్నప్పటికీ, ప్రత్యేకంగా ఈ రోజే రావడానికి ఒక కారణం ఉందని తెలిపారు. ఈ రోజు తనకు దైవసమానులైన నారా భువనేశ్వరి జన్మదినం కావడంతో, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని రూ. 5 లక్షలు తీసుకొచ్చి ఆ బాబుకు అందజేస్తే తన హృదయం ఎంతో ఆనందపడుతుందని భావించి వచ్చినట్లు చెప్పారు. ఆ