
Kothagudem: పల్స్ పోలియో ప్రారంభం.. చుక్కలు వేసిన కలెక్టర్ అంకిత్! భద్రాద్రి: ఆదివారం జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా పాల్వంచ మండలం ఇందిరా నగర్ కాలనీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.. జిల్లాలో ప్రతి ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు మిస్ కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ప్రయాణాలు ఉన్న కుటుంబాలు బస్టాండ్లు రైల్వేస్టేషన్లలో ఏర్పాటుచేసిన పోలియో కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే ఇటుక బట్టీలు వ్యవసాయ పనులు నిర్మాణ ప్రదేశాలు ఇతర పని ప్రదేశాల్లో ఉన్న చిన్నారులకు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి ప్రభుత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన చిన్నారులకు ఈ నెల 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్ళి ఆరోగ్య సిబ్బంది ద్వారా పోలియో చుక్కలు వేయిస్తామని తెలిపారు.జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలోజిల్లా కేంద్రంలోనిబస్ స్టాండ్ ఆవరణలో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని డాక్టర్ తుకారం రాథోడ్ పరిశీలించారు. కూరగాయల వారపు సంతలో, ప్రయాణికుల వద్దకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ స్వయంగా వెళ్లి దగ్గరుండి పోలియో చుక్కలను వేయించినందుకు హర్షం వ్యక్తం చేసిన స్థానిక ప్రజలు..ఈ సందర్భంగా డాక్టర్ తుకారం రాథోడ్ మీడియాతో మాట్లాడుతూజిల్లా వ్యాప్తంగా 5 సంవత్సరాల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం మొదలైందన్నారు.మొత్తం 98,818 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయడం టార్గెట్ అన్నారు. దీనిలో భాగంగా కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్ నందు ఏర్పాటు చేసిన పల్స్ పోలియో చుక్కల కార్యక్రమంలో డిఎం&హెచ్ఓ తుకారం రాథోడ్