పల్లెలకూ ఏసీ విద్యుత్ బస్సులు నడుపుతాం
Actor ProfilePolitician

పల్లెలకూ ఏసీ విద్యుత్ బస్సులు నడుపుతాం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పల్లెలకూ ఏసీ విద్యుత్ బస్సులు నడుపుతాం
Eenadu3 Jul 2026
పల్లెలకూ ఏసీ విద్యుత్ బస్సులు నడుపుతాం

ఈనాడు, అమరావతి: ఆర్టీసీలో 2029 నాటికి 5,120 విద్యుత్‌ బస్సులు తీసుకోనున్నామని, గ్రామాలకూ ఏసీ విద్యుత్‌ బస్సులు నడుపుతామని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. వీటిని కూడా పల్లెవెలుగు సర్వీసుల్లానే నడుపుతామని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు 2031 నాటికి ఆర్టీసీలో పూర్తిగా పర్యావరణహితమైన విద్యుత్, సీఎన్‌జీ బస్సులే ఉంటాయని చెప్పారు. రవాణాశాఖలో రెండేళ్లలో జరిగిన అభివృద్ధిని మంత్రి సోమవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో వివరించారు. ‘స్త్రీశక్తి పథకం సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. ఇప్పటివరకు 73.62 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారు. ఈ ప్రయాణాలకు సబ్సిడీ కింద ప్రభుత్వం రోజుకు రూ.8.50 కోట్లు చొప్పున వెచ్చిస్తోంది. దివ్యాంగశక్తి పథకం కింద దివ్యాంగులు 38.22 లక్షల ప్రయాణాలు చేశారు. పాతవాహనాలకు గ్రీన్‌ట్యాక్స్‌ తగ్గించాం’ అని మంత్రి తెలిపారు. ‘నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకొని, మన రాష్ట్రంలో తిరిగే ఆలిండియా టూరిస్ట్‌ పర్మిట్‌ (ఏఐటీపీ) ట్రావెల్స్‌ బస్సులకు పన్ను తగ్గించనున్నాం. మంగళవారం జరిగే క్యాబినెట్‌లో దీనిపై నిర్ణయం తీసుకుంటాం. ఆ తర్వాత ఆయా బస్సులు ఏపీకి వచ్చి రీరిజిస్ట్రేషన్‌ చేసుకుంటాయి’ అని చెప్పారు. కొన్ని ఆర్టీసీ డిపోలను విద్యుత్‌ బస్సుల గుత్తేదార్లకు ఇచ్చేస్తున్నామనేది వాస్తవం కాదని, అక్కడ ఛార్జింగ్‌ పాయింట్లు, బస్సుల నిర్వహణ పనులకే అవకాశం కల్పిస్తున్నామని రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. రాష్ట్రంలో తిరిగే 1,800 ఏఐటీపీ బస్సులను.. గంటకు 80 కి.మీ. వేగాన్ని మించి వెళ్లకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నట్లు రవాణాశాఖ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత