పల్నాడు జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
Actor ProfilePolitician

పల్నాడు జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పల్నాడు జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
Andhra Jyothy19 Jun 2026
పల్నాడు జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. రాజధాని అమరావతి నుంచి మధ్యాహ్నం చిలకలూరిపేట మండలం లింగంగుంట్లకు ఆయన హెలికాఫ్టర్‌లో చేరుకుంటారు. అమరావతి, జూన్19: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం (జూన్ 20వ తేదీ) పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం ఉదయం 9.00 గంటలకు ఉండవల్లి గుహల వద్ద మీడియా సమావేశంలో ఆయన మాట్లాడనున్నారు. అనంతరం హెలికాఫ్టర్‌లో చిలకలూరిపేట మండలం లింగంగుంట్లకు ఆయన చేరుకుంటారు. ఆ గ్రామంలో స్థానిక అంగన్‌వాడీ కేంద్రాన్ని ఏపీ సీఎం సందర్శిస్తారు. ఆ కేంద్రం పనితీరును పరిశీలిస్తారు. ఆ తర్వాత రైతులతో ఆయన ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలు, వ్యవసాయ పరిస్థితులపై వారితో చర్చిస్తారు. ఆ కార్యక్రమంలో అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా రైతుల ఖాతాల్లోకి నగదును సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2.15 గంటలకు టీడీపీ కేడర్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 3.50 గంటలకు ప్రజా వేదిక సమావేశంలో సీఎం పాల్గొంటారు. ప్రజావేదికలో స్థానిక సమస్యలు, అభివృద్ధి అంశాలపై ఆయన మాట్లాడతారు. సాయంత్రం 6 గంటలకు లింగంగుంట్ల నుంచి హెలికాప్టర్‌లో ఉండవల్లికి సీఎం చంద్రబాబు తిరుగు ప్రయాణం అవుతారు. ఈ పల్నాడు జిల్లా పర్యటనలో రైతులు, ప్రజలతో సీఎం చంద్రబాబు నేరుగా ముచ్చటించనున్నారు. యువతకు ప్రధాని మోదీ 24 కోట్ల ఉద్యోగాలు బాకీ: జగ్గారెడ్డి సీఎం చంద్రబాబు అధ్యక్షతన 235వ ఎస్ఎల్‌బీసీ సమావేశం