
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని బాధ్యతగా సంరక్షిస్తూ పర్యావరణ పరరక్షణకు పాటుపడాలని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు. సిర్పూరు(టి)లోని వేంపల్లితో పాటు పలు గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సిర్పూరు(టి), జూన్ 18 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని బాధ్యతగా సంరక్షిస్తూ పర్యావరణ పరరక్షణకు పాటుపడాలని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు. సిర్పూరు(టి)లోని వేంపల్లితో పాటు పలు గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. చెట్లతో వాతావరణ సమతులత్య ఏర్పడుతుందన్నారు. భావి తరాల వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కటి వాతావరణం అందించే అవకాశాలున్నాయన్నారు. జీవ వైవిధ్యం మెండుగా ఉన్న మన నియోజకవర్గంల ప్రజలు భాగస్వామ్యం లేనిదే అటవీ సంరక్షణ సాధ్యం కాదన్నారు. సాలిగాం నల్లవాగు వద్ద లక్షల సంవత్సరాల క్రితమే రాక్షస బల్లులు తిరిగాయని చెప్పారు. వాటి పాదముద్రలు ఇటీవల శాస్త్రవేత్తలకు లభించాయని వివరించారు. అడవిలోని చెట్లు, జంతువుల సంరక్షణ కోసం యువత, మహిళలు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎఫ్‌డీవో అప్పయ్య, ఎఫ్‌ఆర్వో లక్ష్మణ్, డీఆర్వోలు శశిధర్ బాబు, హేమలత, ఎఫ్‌ఎస్‌వోలు జగన్‌మోహన్ గౌడ్, కామరాజు, ఎఫ్‌బీవో విజయ్, రమాదేవి, స్వాతి, శ్రీనివాస్, సత్యనారాయణ, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ ద్వారా వచ్చిన ఆర్థిక సాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలంలోని పలువురికి మంజూరైన కల్యాణ లక్ష్మి, షాదీముబాకర్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు నేరుగా వారి వ్యక్తిగతలో జమ చేసుకోవాలన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీముబాకర్ మంజూరు