పన్ను వసూళ్ల
Actor ProfilePolitician

పన్ను వసూళ్ల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పన్ను వసూళ్లపై నిఘా
Eenadu29 Aug 2026
పన్ను వసూళ్లపై నిఘా

ఎగవేతలు, మోసాలు అరికట్టేందుకు ఛేజింగ్‌ సెల్‌ పెండింగ్‌ ప్రాజెక్టులు, పనుల పూర్తికి శాఖలవారీ బడ్జెట్‌ రాష్ట్ర ఆదాయ సమీకరణ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో జరిగిన ఎంవోయూ కార్యక్రమంలో అనలాగ్‌ సీఈవో అలెక్స్‌ కిప్‌మాన్, మేఘా ఇంజినీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ ఎండీ కృష్ణారెడ్డి. చిత్రంలో ఉత్తమ్, భట్టి, జూపల్లి ఈనాడు, హైదరాబాద్‌: పన్నుల వసూళ్లలో మోసాలు, ఎగవేతలను అరికట్టి ఆదాయం పెంచేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఛేజింగ్‌ సెల్‌ పేరుతో ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘రాష్ట్ర బడ్జెట్‌ లక్ష్యాలను సాధించడానికి ఆదాయ సమీకరణపై కచ్చితత్వంతో కూడిన కార్యాచరణ అవసరం. ప్రభుత్వం శాసనసభలో ప్రతిపాదించే బడ్జెట్‌ ఊహాజనితం కాదన్న విషయం గుర్తుపెట్టుకోండి’ అని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదాయ సమీకరణపై బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం సమీక్షించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు, ప్రభుత్వ సలహాదారు కె రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆదాయ పెంపు విషయంలో ముఖ్యమంత్రి.. అధికారులకు పలు కీలక ఆదేశాలిచ్చారు. ‘‘హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీ ఆదాయ సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించండి. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, మైనింగ్‌తో పాటు ఇతర శాఖలకు సంబంధించి లీకేజీలను పూర్తిగా అరికట్టాలి. ఆదాయం పెంపు, నిధుల సమీకరణ విషయంలో అన్నిశాఖలూ నిర్లక్ష్యం వీడాల్సిందే.శాఖలవారీగా సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకోండి. పెండింగ్‌ ప్రాజెక్టులను, ఇతర పనులను పూర్తి చేసేందుకు శాఖలవారీగా బడ్జెట్‌ను తయారు చేసుకోవాలి. భూసేకరణకు మొదటి ప్రాధాన్యం ఇవ్వండి. శాఖలకు అవసరమైన అన్ని రకాల సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ అక్రమాల నియంత్రణకు చేపట్టిన చర్యలతో జీఎస్టీ వసూళ్లు పెరిగాయని ఈ శాఖ అధికారులు సమావేశంలో వివరించారు. ఇలా ఏయే