
Fauzi : ప్రభాస్ సంక్రాంతికి రాజాసాబ్ సినిమాతో వచ్చి ప్రేక్షకులను నిరాశపరిచాడు. దీంతో ఫ్యాన్స్ ప్రభాస్ నెక్స్ట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ లైనప్ లో అన్ని భారీ సినిమాలు ఉన్నాయి. ఒకేసారి మూడు ప్రభాస్ సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయి. కానీ అన్నిటికన్నా ముందొచ్చే సినిమా ఫౌజీ. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రేమ, యుద్ధం కాన్సెప్ట్ తో పీరియాడిక్ సినిమాగా భారీగా తెరకెక్కుతుంది ఫౌజీ. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోయినా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ ఆర్మీ వ్యక్తిగా కనిపించబోతున్నాడని సమాచారం. ఈ సినిమాని స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఈ సంవత్సరం ఆగస్టు 15 రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసారు. ఆ తర్వాత దసరా అని కూడా అనుకున్నారు. తాజా టాలీవుడ్ సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ వాయిదా పడినట్టు తెల్లుస్తుంది. ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉండటంతో ఈ సినిమా అవుట్ పుట్ కి ఇంకా చాలానే సమయం పట్టేలా ఉందని తెలుస్తుంది. దీంతో ఫౌజీ సినిమా క్రిస్మస్, న్యూ ఇయర్ కలిసొచ్చేలా డిసెంబర్ లో రిలీజ్ చేస్తారని టాక్. అయితే వచ్చే నెల జులైలో మాత్రం ఫౌజీ టీజర్ రిలీజ్ చేస్తారని సమాచారం. దీంతో ఫ్యాన్స్ ఫౌజీ టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు